Kannappa: ‘కన్నప్ప’ సినిమా నుంచి బిగ్ అప్డేట్.. క్యూరియాసిటీ పెంచుతున్న మంచు విష్ణు ట్వీట్

టాలీవుడ్ హీరో విష్ణు మంచు(Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’.

Update: 2024-11-18 07:25 GMT
Kannappa: ‘కన్నప్ప’ సినిమా నుంచి బిగ్ అప్డేట్.. క్యూరియాసిటీ పెంచుతున్న మంచు విష్ణు ట్వీట్
  • whatsapp icon

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో విష్ణు మంచు(Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’. ముఖేశ్‌కుమార్(Mukesh Kumar) దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీని అవా ఎంటర్‌టైన్మెంట్స్(Ava Entertainments), 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్(Prabhas), మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, శరత్ కుమార్(Sarath Kumar), మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రాంకా కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొన్నాయి.

ఇప్పటికే ‘కన్నప్ప’(Kannappa) నుంచి విడుదలైన పోస్టర్స్ అన్ని భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. ఈ క్రమంలో.. తాజాగా, మంచు విష్ణు ‘కన్నప్ప’ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఓ పోస్టర్‌ను విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచారు. ఈ సినిమాలో మోహన్ బాబు (Mohan Babu)మహాదేవ శాస్త్రి పాత్రలో నటించబోతున్నట్టు ప్రకటించారు.

అంతేకాకుండా ఆయన మూడు నామాలు పెట్టుకుని కుంకుమ బొట్టుతో ఉన్న లుక్‌ను షేర్ చేశారు. కానీ ఇందులో ముఖమంతా మాస్క్ ఉండగా.. కళ్ళతో పాటు నుదుటి భాగాన్ని మాత్రమే రివీల్ చేశారు. ఫుల్ పోస్టర్‌ను నవంబర్ 22న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రజెంట్ మంచు విష్ణు పోస్ట్ సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది. 

Tags:    

Similar News