Anjeer: అంజీరాతో నూరేళ్లు వర్ధిల్లు!

దిశ, ఫీచర్స్ : 1500 సంవత్సరంలో ప్రపంచానికి పరిచయమైన 'అంజీర'.. పుష్కలమైన హెల్తీ కంటెంట్‌తో నిండి

Update: 2022-04-19 08:47 GMT

దిశ, ఫీచర్స్ : 1500 సంవత్సరంలో ప్రపంచానికి పరిచయమైన 'అంజీర'(Anjeer).. పుష్కలమైన హెల్తీ కంటెంట్‌తో నిండి ఉందని ప్రచారం చేశారు మిషనరీస్. అంతేకాదు 1700 కాలంలో కాలిఫోర్నియా అంతటా వీటిని నాటడం ద్వారా సరికొత్త స్వీట్‌నెస్‌ను ఇంట్రడ్యూజ్ చేశారు. ఆ విధంగా ప్రపంచమంతటా విస్తరించిన ఈ పండ్లను ఎండిన లేదా తాజాగా తినే సౌలభ్యం ఉండగా.. ఆరోగ్యంతో పాటు ఆయుర్దాయాన్ని పెంచే 'అంజీర హెల్తీ హ్యాబిట్స్' ఏంటి? నిజంగా అత్తి పండ్లు మనిషి వందేళ్లకు పైగా ఆరోగ్యంగా జీవించేలా చేస్తాయా? ఎలా? చూద్దాం.

1. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి..

అత్తి పండ్లలో ఆరోగ్యకరమైన కరిగే ఫైబర్ మోతాదు అధికంగా ఉంటుంది. దాదాపు నాలుగు ఎండిన అత్తి పండ్లను తినడం వలన 100 కేలరీలు మరియు నాలుగు గ్రాముల ఫైబర్ అందుతుంది. ఇది రోజువారీ సిఫార్సు చేసిన మొత్తం లో 14%. సోల్యుబుల్ ఫైబర్‌తో కూడిన అత్తి పండ్ల వంటి ఆహారాలు తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందని అధ్యయనాలు నిర్ధారించాయి.

2. వాపుతో పోరాడేందుకు సాయం..

అంజీర లో ఉండే సహజ మొక్కల సమ్మేళనాలు.. ఫైటో న్యూట్రియెంట్స్(పాలీఫెనాల్స్) మరియు కెరోటినాయిడ్స్ యాంటీఆక్సిడెంట్లు గా పనిచేస్తాయి. ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు మంట మరియు వాపును నివారించడంలో సహాయపడతాయి.

3. గ్లూకోజ్ కంట్రోలర్స్..

అంజీరాలో ABA (అబ్సిసిక్ యాసిడ్) అనే సమ్మేళనం ఉందని పరిశోధనలో తేలింది. ఇది గ్లూకోజ్ పెరిఫెరల్స్‌ను తీసుకోవడాన్ని మెరుగుపరుస్తుంది మరియు ఇన్సులిన్ నుంచిశరీరంలోకి గ్లూకోజ్‌ను లాగుతుంది. పరిశోధనలో ఉపయోగించిన అత్తి పండ్ల సారం దాదాపు ఒకటిన్నర అంజీరాలకు సమానం కాగా గ్లూకోజ్‌ కంట్రోలర్స్‌గా ఉపయోగపడతాయని స్పష్టం అయింది.

4. శరీరానికి అధిక పోషకాలు..

దాదాపు నాలుగు అత్తి పండ్ల ద్వారా 100 కేలరీలు అందుతాయి. ఇవి రోజువారీ సిఫార్సు చేసిన పొటాషియం మొత్తంలో 6%, అలాగే కాల్షియం మరియు ఐరన్‌లో 4% అందిస్తాయి. 2020-2025 అమెరికన్ డైటరీ గైడ్‌లైన్స్ ప్రకారం డైట్‌లో పొటాషియం మరియు కాల్షియం లోపించినట్లు నివేదించింది. కాబట్టి రోజువారీ డైట్‌లో అంజీరాను చేర్చడం ద్వారా శరీరంలో లోపించిన పోషకాలను భర్తీ చేసే సాధనంగా పనిచేస్తోంది.

5. క్యాన్సర్ నిరోధకాలు..

అంజీరా క్యాన్సర్‌ను నిరోధించడంలోనూ సహాయపడుతుందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. అత్తిపండ్లు పాలీఫెనాల్స్ మరియు కెరోటినాయిడ్లను అందిస్తాయి. ఈ రెండు ఫైటో న్యూట్రియెంట్స్.. క్యాన్సర్‌కు దారితీసే కార్సినోజెన్‌లను రిమూవ్ చేయడంలో సహాయపడతాయి. అంతేకాదు DNA మరియు ఇతర కణజాల నష్టాన్ని సరిచేయడంలో హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి.

Tags:    

Similar News