Bejawada Bebakka: దుబాయ్‌లో అంగరంగ వైభవంగా పిల్లికి పెళ్లి చేయబోతున్న బెజవాడ బేబక్క

బెజవాడ బేబక్క క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2024-10-09 07:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: బెజవాడ బేబక్క క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. రీల్స్, తన యాసతో స్పెషల్ క్రేజ్ దక్కించుకుంది. ఇన్నిడేస్ అమెరికాలో ఉంటూ కావాల్సినంత డబ్బు సంపాదించానని, జీతం కోటి రూపాయలని ఓ ఇంటర్వ్యూలో వివరించి.. నెటిజన్లకు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. వీటితో పాటు స్కూల్ కాలేజీ వివరాలు తెలిపింది. ఎంబీఎ చేశానని, యూనివర్సిటీ టాపర్ అని, అంతేకాకుండా లెక్చరర్‌గా అవకాశం కూడా వచ్చిందని బేబక్క వెల్లడించింది. కానీ ఉద్యోగం వదిలేసుకుని అమెరికా వెళ్లానని చెప్పింది. అక్కడ పదేళ్లు జాబ్ చేశానని, ఆ కంపెనీతో తనే యంగెస్ట్ అని పేర్కొంది. అలాగే జీతం కూడా ఆ సంస్థలో తనకే ఎక్కువగా ఇచ్చేవారని తెలిపింది.

కానీ బిగ్‌బాస్ ఆఫర్ రావడంలో ఉద్యోగం వదులుకుని  ఇక్కడికి వచ్చానని చెప్పింది. ఇక బేబక్క రీసెంట్‌గా ప్రారంభమైన తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 లోకి కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ మొదటి వారంలోనే ఎలిమినేట్ అయి ఫ్యాన్స్ కు నిరాశ మిగిల్చింది. అయితే క్రేజీ బ్యూటీ తాజాగా ఓ క్రేజీ విషయం వీడియో ద్వారా వెల్లడించింది. తన దగ్గర పిల్లి ఉందని, దాని పేరు సింబా. దీనికి పెళ్లి చేయాలనుకుంటున్నానని తెలిపింది. దీనికోసం దుబాయ్ ఫ్లైట్ లో పెళ్లి కొడుకు వస్తున్నాడని వెల్లడించింది. పెళ్లికొడుకు పిల్లికి నచ్చినట్లైతే ఇక గ్రాండ్‌గా పెళ్లి చేసి దుబాయ్ కు పంపించేయడమే అని వీడియోలో చెప్పింది. బేబక్క కూడా తర్వాత అక్కడే సెటిల్ అయిపోతానని వ్యాఖ్యానించింది.

Tags:    

Similar News