Bandla Ganesh: విజయసాయికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న బండ్ల గణేశ్

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ నేత, సినీ నటుడు బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2022-04-16 12:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ నేత, సినీ నటుడు బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి నుంచి వరుస ట్వీట్లతో విజయసాయిరెడ్డికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాడు. తాజాగా.. మరోసారి ఆయనపై బండ్ల గణేశ్ ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. ''నీకు ఒక ముఖ్య విషయం తెలియజేయాలి దొంగసాయి.. నేను ఎప్పటికీ తెలుగుదేశం కాదు. నేను వైయస్ రాజశేఖర్రెడ్డి గారి అభిమానిని అది నిజమో కాదో కావాలంటే గౌరవనీయులైన రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ బంధువు కేవీపీ గారిని అడిగి తెలుసుకో.. దొంగసాయి.. నేను ఏపార్టీయో ఆయన చెబుతారు దొంగ సాయి'' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అంతేగాక.. ''చంద్రబాబు నా బాసా..? నాకు నీతి నియమం ఉంది.. నీలాగా కాదు దొంగ సాయి. నేను ఎప్పటికీ తెలుగుదేశం అభ్యర్థిని కాదు. నేను తెలుగుదేశం పార్టీ కాదు. చంద్రబాబు నాయుడుకి నాకు సంబంధం లేదు. దొంగ సాయి గుర్తుపెట్టుకో..?, జనాన్ని మోసం చేయడం, ప్రభుత్వ సొమ్ము దోచుకోవటం, అడ్డంగా బుక్కై జైలుకెళ్లడం కాదు.. ఇది గుర్తు పెట్టుకో దొంగ సాయి'' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చివరగా.. ''నేను తల్లిదండ్రులకు పుట్టా.. నీలాగా నీతిలేని బ్రతుకు నేను బతకను. రాజకీయాల్లో ఉన్న ఇంట్లో ఉన్న ఒక నిజాయితీగా ఉంటా, ఒకరిని అభిమానిస్తా, ఒకరినే ప్రేమిస్తా, ఒకరితోనే ప్రాణం పోయేదాకా తోడుంటా నీ లాగా దొంగ వేషాలు వేయను దొంగ సాయి'' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.



Tags:    

Similar News