పదేళ్ల పాటు ఆస్కార్‌కు హాజరుకాకుండా స్టార్ హీరో పై నిషేధం

దిశ, వెబ్‌డెస్క్: ఆస్కార్ - 2022 వేడుకల్లో క్రిస్ రాక్‌ను వేదికపైనే చెంపదెబ్బ కొట్టినందుకు ప్రముఖ నటుడు,

Update: 2022-04-09 04:15 GMT
పదేళ్ల పాటు ఆస్కార్‌కు హాజరుకాకుండా స్టార్ హీరో పై నిషేధం
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఆస్కార్ - 2022 వేడుకల్లో క్రిస్ రాక్‌ను వేదికపైనే చెంపదెబ్బ కొట్టినందుకు ప్రముఖ నటుడు, స్టార్ హీరో.. విల్ స్మిత్‌పై ఆస్కార్ అకాడమీ క్రమశిక్షణా చర్యలకు దిగింది. విల్ స్మిత్‌పై 10 సంవత్సరాల పాటు నిషేధం విధించింది. దీంతో నటుడు స్మిత్.. ఆస్కార్, ఇతర అకాడమీ ఈవెంట్‌లకు హాజరు కాకుడదు. ఆస్కార్ సంస్థ ఓ ప్రకటనలో, అకాడమీ 94వ అవార్డులు స్మిత్ ప్రదర్శించిన ఆమోదించలేని, హానికరమైన ప్రవర్తనతో కప్పివేయబడిందని పేర్కొంది. అలాగే స్మిత్ పై నిషేధం విధించడం ప్రదర్శనకారులు, అతిథులను రక్షించే లక్ష్యంతో ఉందని పేర్కొన్నారు.

Tags:    

Similar News