YSRCP: పార్టీ మార్పుపై వైసీపీ కీలక నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ..

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ క్యాబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కని నేతలు తీవ్ర అసంతృప్తితో- Latest Telugu News

Update: 2022-04-11 13:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ క్యాబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కని నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన ఈ ఇష్యూపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే కొందరు కొందరు వైసీపీ నేతలు రాజీనామా చేయగా.. మరికొందరు రాజీనామా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మంత్రి వర్గ విస్తరణలో మరోసారి మంత్రి పదవి దక్కని వైసీపీ కీలక నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారంటూ రాష్ట్రవ్యా్ప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, సీఎం జగన్‌తో భేటి అయిన బాలినేని తనపై వస్తున్న వార్తలపై స్పందించారు.

మంత్రి పదవుల కేటాయింపు సీఎం ఆలోచన ప్రకారం ఉంటుందన్నారు. మంత్రి పదవి కోసం ఎప్పుడూ పాకులాడలేదని తెలిపారు. 25 మంది మంత్రుల్ని మారుస్తారన్నప్పుడు మొదట స్పందించింది నేనే అని పేర్కొన్నారు. పార్టీ మారుతారనే ప్రచారమంతా ఊహగానాలే అని అన్నారు. పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చినా నిర్వహిస్తానని తెలిపారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను. ఆదిమూలపు సురేష్‌తో ఎలాంటి విభేదాలు లేవని వెల్లడించారు. వైఎస్ కుటుంబానికి నేను ఎప్పుడూ విధేయుడినే అని అన్నారు.

Tags:    

Similar News