ఉక్రెయిన్‌లో ఇప్పటివరకు 112 మంది చిన్నారుల, 902 పౌరులు మృతి: ఐరాస

కీవ్: రష్యా దురాక్రమణలో వందల సంఖ్యలో పిల్లలు బలయ్యారని ఉక్రెయిన్ పిల్లల ప్రాసిక్యూటర్ latest telugu news..

Update: 2022-03-20 16:57 GMT

కీవ్: రష్యా దురాక్రమణలో వందల సంఖ్యలో పిల్లలు బలయ్యారని ఉక్రెయిన్ పిల్లల ప్రాసిక్యూటర్ కార్యాలయం వెల్లడించింది. గత నెల 24 నుంచి ఇప్పటివరకు పలు దాడుల్లో 112 మంది పిల్లలు చనిపోగా, 140 మందికి పైగా గాయపడినట్లు తెలిపింది. రాజధాని కార్యాలయం వెల్లడించిన ప్రకారం కీవ్ లో 57, ఖర్కోవ్ లో 34, చెర్నిహీవ్ లో 30, డెనెట్క్స్ లో 28, మైకో లైవ్ లో 20, యిటోమిర్ లో 15, సుమీ, ఖెర్సన్ ప్రాంతాల్లో 14 మంది చొప్పున మరణించారని పేర్కొంది.

అంతేకాకుండా దాదాపు 500 వరకు విద్యాసంస్థలు కూడా పాక్షికంగా ధ్వంసమయ్యాయని వెల్లడించారు. ఇక యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు 902 మంది పౌరులు మరణించారని ఐరాస మానవ హక్కుల కార్యాలయం ఆదివారం తెలిపింది. దాదాపు 1400 మందికి పైగా గాయపడ్డారని పేర్కొంది. చాలా మరణాలు పేలుళ్లు, షెల్లింగ్, వైమానిక దాడుల వల్ల చోటుచేసుకున్నట్లు వెల్లడించింది. అయితే మరణాల సంఖ్య ఎక్కువగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News