Asaduddin Owaisi: ఇద్దరు పిల్లల విధానంపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

Asaduddin Owaisi Says He will not Support any law Mandating Only 2 Child| హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసద్దుదీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు పిల్లల పాలసీని తాను వ్యతిరేకమని అన్నారు. ఇది దేశానికి ఏమాత్రం ఉపయోగం కాదని స్పష్టం చేశారు.

Update: 2022-07-14 11:43 GMT

దిశ, వెబ్‌డెస్క్ : Asaduddin Owaisi Says He will not Support any law Mandating Only 2 Child| హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసద్దుదీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు పిల్లల పాలసీని తాను వ్యతిరేకమని అన్నారు. ఇది దేశానికి ఏమాత్రం ఉపయోగం కాదని స్పష్టం చేశారు. గతంలో చైనా చేసిన తప్పును భారత్ చేయకూడదని హెచ్చరించారు. ఇద్దరు పిల్లలను మాత్రమే తప్పనిసరి చేస్తూ భారతదేశంలో చట్టం తేవాలని చూస్తే అలాంటి ఏ చట్టానికి మద్దతు ఇవ్వబోమని గురువారం ట్వీట్ చేశారు. ఇలాంటి వాటి వల్ల దేశానికి ప్రయోజనం ఏమీ లేదని అన్నారు. దేశంలో ఫెర్టిలిటీ రేట్ తగ్గిపోతోందని.. 2030 వరకు ఇది స్థిరీకరించబడుతుందని పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం జనాభా అసమతుల్యతపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలతో ముస్లింలు ఎక్కువగా గర్భనిరోధకాలను ఉపయోగిస్తున్నారని ఒవైసీ అన్నారు. జనాభా నియంత్రణకు దేశంలో ఎలాంటి చట్టం అవసరం లేదని ఇదే విషయాన్ని వారి సొంత ఆరోగ్య శాఖ మంత్రే చెప్పారని అన్నారు. ముస్లింలు ఎక్కువగా గర్భనిరోధక సాధనాలను ఉపయోగిస్తున్నారని ఒవైసీ అన్నారు.

ముస్లింలనే ఎందుకు వెలెత్తి చూపుతున్నారు?

జనాభా విషయంలో ముస్లింలను మాత్రమే ఎందుకు వేలెత్తి చూపుతున్నారని ఒవైసీ ప్రశ్నించారు. ముస్లింలు భారతదేశ స్థానికులు కాదా? వాస్తవానికి గిరిజనులు, ద్రావిడ ప్రజలు మాత్రమే భారత మూల వాసులని అన్నారు. యూపీలో ఎటువంటి చట్టం లేకుండా సంతానోత్పత్తి రేటు ఆశించిన రీతిలో ఉందని, 2026-2030 నాటికి అది పూర్తిగా సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలను చూస్తే కొన్ని వర్గాల జనాభా ఎక్కువ ఉండకూడదని అనుకుంటున్నారేమో అని సందేహం వ్యక్తం చేశారు. దాని కోసమే 'అసలు స్థానికులు' అనే చర్చను తెర పైకి తీసుకువస్తున్నారేమో అని విమర్శించారు.

ఇదిలా ఉంటే ఇద్దరు పిల్లల విధానం అనేది దేశంలో చాలా కాలంగా ఉన్న కాన్సెప్ట్.. ఇంతకు ముందే అనేక సందర్భాల్లో చర్చకు వచ్చింది. ఇద్దరు పిల్లలు ముద్దు అనే నినాదం దేశంలో అమలులో ఉంది. అస్సాం, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో సహా అనేక రాష్ట్రాల్లో ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయరాదనే నిబంధన ఉంది. అయితే ఈ నిబంధన కారణంగా భవిష్యత్ లో దేశ జనాభా తగ్గి శ్రామిక శక్తి కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒవైసీ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

మోడీ వెనుక అతడు కూర్చోవడం అన్ పార్లమెంటరీ కాదా?

పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అన్ పార్లమెంటరీ పదాలు అని పేర్కొంటూ కొన్ని పదాలను అధికారులు నిషేదించిన సంగతి తెలిసిందే. ఈ ఇష్యూపై స్పందించిన ఒవైసీ.. సభలో ఏ విషయంపై మాట్లాడుతున్నామన్నదే ముఖ్యమని అన్నారు. అంతే కానీ ఫలానా పదాలు అన్ పార్లమెంటరీ వర్డ్ అని చెప్పడం కుదరదని అన్నారు. ఇటీవల నూతన పార్లమెంట్ భవనంపై జాతీయ చిహ్నాలను ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ వెనుక లోక్ సభ స్పీకర్ కూర్చోవడం అన్ పార్లమెంటరీ కాదా అని ఒవైసీ ప్రశ్నించారు.

Tags:    

Similar News