Asaduddin Owaisi: ఉదయ్ పూర్ హత్యపై స్పందించిన ఒవైసీ.. ఆమెను అరెస్ట్ చేయాలని డిమాండ్
Asaduddin Owaisi Demands Nupur Sharma arrests with punishment for Kanhaiya Lal Murderers| ఉదయ్ పూర్ దారుణ హత్య ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ, మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలను సమర్థించినందుకు కన్నయ్య లాల్
దిశ, వెబ్‌డెస్క్: Asaduddin Owaisi Demands Nupur Sharma arrests with punishment for Kanhaiya Lal Murderers| ఉదయ్ పూర్ దారుణ హత్య ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ, మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలను సమర్థించినందుకు కన్నయ్య లాల్ అనే వ్యక్తిని ప్రత్యర్థి వర్గం కిరాతంగా హత్య చేశారు. అంతేకాకుండా హత్య చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడింది. తాజాగా ఉదయ్ పూర్ హత్య ఘటనపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లో జరిగిన హత్య ఘటనను ఖండించారు. సస్పెన్షన్‌కు గురైన బీజేపీ నేత నుపుర్ శర్మకు మద్దతు ఇచ్చినందుకు ఓ దర్జీని హత్య చేయడాన్ని ఆయన తప్పు బట్టారు. పోలీసులు అప్రమత్తంగా ఉంటే ఈ హత్య జరిగేది కాదని అన్నాడు. కిరాతకానికి పాల్పడిన వారిపై రాజస్థాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దేశంలో రాడికలైజేషన్ వ్యాప్తి చెందుతోందని.. వెంటనే నుపుర్ శర్మను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కేవలం సస్పెషన్ మాత్రమే సరిపోదని అన్నారు.