ఒత్తిడి తట్టుకోలేక ఆ పని చేస్తా.. బాలీవుడ్ బ్యూటీ

దిశ, సినిమా : చిన్న వయసులోనే బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన నటుల్లో అనన్య పాండే ఒకరు. పట్టుమని పది latest telugu news..

Update: 2022-03-20 11:42 GMT
ఒత్తిడి తట్టుకోలేక ఆ పని చేస్తా.. బాలీవుడ్ బ్యూటీ
  • whatsapp icon

దిశ, సినిమా : చిన్న వయసులోనే బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన నటుల్లో అనన్య పాండే ఒకరు. పట్టుమని పది సినిమాలైనా చేయకముందే ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. 2019లో విడుదలైన తన తొలి చిత్రం 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో గుర్తింపు సంపాదించిన అనన్య లేటెస్ట్ ఫిల్మ్ 'గెహ్రాయియా'లో నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే గ్లామర్ ఇండస్ట్రీలో స్థిరంగా నిలదొక్కుకోవడం అనుకున్నంత సులభం కాదని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది.

ఇక్కడ నిరంతరం ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుందని, రాత్రికి రాత్రే స్టార్‌గా ఎలా ఎదిగిపోతారో అంతకన్నా వేగంగా కనుమరుగైపోయే ప్రయాదం వెంటాడుతూనే ఉంటుందని తెలిపింది. తను కూడా ఎన్నోసార్లు ఒత్తిడి గురైనట్లు చెబుతూ.. అలాంటి టైమ్‌లో మనసుకు సంతోషాన్నిచ్చే పనులు చేసేందుకు ఇష్టపడతానని తెలిపింది. ప్రస్తుతం తను విజయ్ దేవరకొండ సరసన పాన్ ఇండియా మూవీ 'లైగర్' లో నటిస్తున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News