Almonds: ఆయుష్షును పెంచే డ్రైఫ్రూట్.. రోజుకు ఎన్ని తినాలి?

సాధారణంగా డ్రైఫ్రూట్స్(Dry fruits) అంటేనే ఆరోగ్యానికి మేలని పోషకాహార నిపుణులు(Nutritionists) చెబుతూనే ఉంటారు.

Update: 2025-01-15 09:00 GMT
Almonds: ఆయుష్షును పెంచే డ్రైఫ్రూట్.. రోజుకు ఎన్ని తినాలి?
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా డ్రైఫ్రూట్స్(Dry fruits) అంటేనే ఆరోగ్యానికి మేలని పోషకాహార నిపుణులు(Nutritionists) చెబుతూనే ఉంటారు. ముఖ్యంగా డ్రైఫ్రూట్స్‌లో చాలా మంది బాదం తీసుకుంటారు. బాదం(Almonds) చేసే మేలు బోలెడు. బాదంలో ప్రోటీన్లు(proteins), ఫైబర్(Fiber), విటమిన్లు(Vitamins), మినరల్స్(Minerals) దట్టంగా ఉంటాయి. బాదంలో మంచి కొవ్వులు ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి(heart health) ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్‌(bad cholesterol)ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌(Good cholesterol)ను పెంచడంలో మేలు చేస్తుంది.

బరువు తగ్గడం(Weight loss)లో కూడా బాదం ఎంతో మేలు చేస్తుంది. మెదడు ఆరోగ్యాన్ని(Brain health), జ్జాపకశక్తి(Memory Power)ని మెరుగుపరుస్తుంది. బాదం పప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులు(Healthy fats), యాంటీఆక్సిడెంట్లు(Antioxidants) పుష్కలంగా ఉంటాయి. దీనిని తినడం వల్ల రక్తపోటు నియంత్రణ(Blood pressure control)లో ఉంటుంది. ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. బాదం పప్పు తినడం వల్ల చర్మం(skin), జుట్టు ఆరోగ్యం(Hair health) కూడా బాగుంటుంది. అంతేకాకుండా బాదం జీర్ణవ్యవస్థ(digestive system)ను హెల్తీగా ఉంచుతుంది. వీటితో పాటు మలబద్ధకం(Constipation) నివారిస్తుంది.

రోగనిరోధక శక్తి(Immunity)ని పెంచడం, రోజంతా ఎనర్జీని ఇవ్వడం, ఎముకలను స్ట్రాంగ్‌గా ఉంచడం, స్కిన్ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం వంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బాదం ఆయుష్షు(longevity)ను పెంచేందుకు మేలు చేస్తుందని తాజాగా నిపుణులు చెబుతున్నారు. కానీ మితంగా తినాలని సూచిస్తున్నారు. కాబట్టి రోజుకు నాలుగు బాదం పప్పులు ముందు రోజు నైట్ వాటర్‌లో నానబెట్టి.. నెక్ట్స్ డే మార్నింగ్ తింటే సంపూర్ణ ఆరోగ్యం(Perfect health)తో పాటు ఆయుష్షు కూడా పొందుతారని నిపుణులు వెల్లడిస్తున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Tags:    

Similar News