Allu Arjun: ఇండస్ట్రీలో తన బిగ్గెస్ట్ కాంపిటీషన్ ఎవరో చెప్పేసిన అల్లు అర్జున్.. (వీడియో)

Update: 2024-11-15 11:20 GMT

దిశ, సినిమా: ప్రజెంట్ సిని ప్రేమికులు ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప-2’ (Pushpa-2). ‘పుష్ప’ కు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన ప్రతి అప్‌డేట్స్‌తో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబోలో వస్తున్న ఈ మూవీ ఎన్నో అంచనాల మధ్య డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. ఇందులో భాగంగా తాజాగా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే (Unstoppable with NBK) కు హాజరైన అల్లు అర్జున్ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఈ మేరకు బాలయ్యబాబు.. తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీలో నీ బిగ్గెస్ట్ కాంపిటీషన్ ప్రభాష్ (Prabhash), మహేశ్ (Mahesh)లో ఎవరు అని అల్లు అర్జున్‌ను ప్రశ్నిస్తాడు. దీనికి అల్లు అర్జున్ ఆన్సర్ చేస్తూ.. ‘నన్ను మించి ఎదిగిన వాడు ఇంకోడు ఉన్నాడు చూడు.. అది ఎవరంటే రేపటి నేనే’ అని చెప్పాడు. ప్రజెంట్ అల్లు అర్జున్ కామెంట్స్ వైరల్ అవుతుండగా.. రకరకాల కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.


Click Here For Twitter Post..


Tags:    

Similar News