Allu Arjun : నాంపల్లి కోర్టులో నటుడు అల్లు అర్జున్

సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద పుష్ప-2 ప్రీమియిర్ షో(Pushpa-2 Premior Show) సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్‌ (Allu Arjun)ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-12-13 10:01 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద పుష్ప-2 ప్రీమియిర్ షో(Pushpa-2 Premior Show) సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్‌ (Allu Arjun)ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయనను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌ (Chikkadpally Police Station)కు తీసుకువెళ్ళి, స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అక్కడి నుంచి వైద్య పరీక్షల నిర్వహించేందుకు గాంధీ ఆసుపత్రికి (Gandhi Hospital)కి తరలించగా.. కొద్దిసేపటి క్రితమే వైద్య పరీక్షలు ముగిసినట్టు సమాచారం. అనంతరం నాంపల్లి కోర్టు (Nampally Court)లో హాజరుపరచగా.. మరికాసేపట్లో మేజిస్ట్రేట్ నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు చిక్కడపల్లి పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లు క్వాష్ చేయాలని తాజాగా బన్నీ హైకోర్టు (High Court)లో క్వాష్ పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా ఈ పిటిషన్ సాయంత్రం 4 గంటలకు విచారణకు రానుంది. 

Tags:    

Similar News