Good Bad Ugly: సంక్రాంతి బరిలో మరో స్టార్ హీరో సినిమా.. పోస్ట్ వైరల్

కోలీవుడ్ స్టార్ (Kollywood Star) హీరో అజిత్ (Ajith) నిటిస్తున్న తాజా సినిమా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly).

Update: 2024-11-19 11:30 GMT

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ (Kollywood Star) హీరో అజిత్ (Ajith) నిటిస్తున్న తాజా సినిమా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly). అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా (Pan India) ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) రూపొందిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అజిత్ ఖైదీ గెటప్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తుండగా.. ఇందులో నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ (Release Date)కు సంబంధించి నెట్టింట్ ఓవార్త చక్కర్లు కొడుతోంది.

ఫిలిమ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. ‘అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ జనవరి 10వ తేదీన ఈ చిత్రం విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట. అంతే కాకుండా.. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ (Final Schedule) పూర్తి చేసుకోవడానికి దాదాపు రెండు వారాల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని టాక్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ మూవీ.. త్వరలో విడుదల తేదీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వనున్నారు మేకర్స్. కాగా.. ఈ చిత్రంలో అజిత్ సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..