పిల్లలను ఫాలో అవుతున్న సీనియర్ హీరో.. ఎందుకో తెలుసా?
దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగన్ ఈ తరం ట్రెండ్‌ను..telugu latest news
దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగన్ ఈ తరం ట్రెండ్‌ను ఫాలో అవడం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అంతేకాదు తన పిల్లల గురించి కూడా ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పిన నటుడు.. వాళ్ల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నట్లు తెలిపాడు. కుమార్తె నైసా కుమారుడు యుగ్ డిజిటల్ స్పేస్‌లోని లేటెస్ట్ ట్రెండ్స్‌పై మిమ్మల్ని అప్డేట్ చేస్తున్నారా? అంటూ ఓ కార్యక్రమంలో విలేఖరి ప్రశ్నకు బదులిచ్చిన అజయ్.. 'మనమంతా యువ తరం నుంచి ఎంతో నేర్చుకుంటామని నేను భావిస్తున్నా. మా పిల్లలు ప్రతి మూడు నెలలకోసారి కొత్తవాటి గురించి చెబుతుంటారు. వాటి గురించి తెలుసుకునేందుకు యువకులతో నిరంతరం డిస్కస్ చేస్తూ ఉంటా. నిజం చెప్పాలంటే.. ఈ పోటీ ప్రపంచానికి అనుగుణంగా ఉండాలంటే లేటెస్ట్ ట్రెండ్స్ అర్థం చేసుకుని తీరాల్సిందే' అంటూ చెప్పుకొచ్చిన అజయ్.. ఈ జెనరేషన్ స్పీడ్ అందుకోవడానికి తన పిల్లలతో నిరంతరం ఏదో విషయం మాట్లాడుతూనే ఉంటానంటున్నాడు.