Farooq abdullah: జమ్ముకశ్మీర్ నేత ఫరూఖ్ అబ్దుల్లా కీలక ప్రకటన
Farooq abdullah Says, not in race for presidential post| నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను విపక్షాల అభ్యర్థిగా రాష్ట్రపతి రేసులో లేనని ప్రకటించారు.
న్యూఢిల్లీ: Farooq abdullah Says, not in race for presidential post| నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను విపక్షాల అభ్యర్థిగా రాష్ట్రపతి రేసులో లేనని ప్రకటించారు. జమ్ముకశ్మీర్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తానని అబ్దుల్లా స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పేరును ప్రతిపాదించినందుకు గౌరవంగా ఉందన్నారు. అయితే తాను దానిని వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు. జమ్ముకశ్మీర్ ఒక క్లిష్టమైన పరిస్థితుల గుండా వెళ్తున్నదని, ఇలాంటి సమయాల్లో తన వంతు ప్రయత్నాలు స్థానికంగా అవసరమని చెప్పారు. కేంద్రపాలిత ప్రాంతంలోనే సానుకూల సహకారం అందించడానికి ఎదురు చూస్తున్నానని అన్నారు. దీంతో మర్యాదపూర్వకంగానే తాను రాష్ట్రపతి అభ్యర్థి పరిశీలన నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. అయితే విపక్షాల తరుఫున అభ్యర్థికి మాత్రం తన సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మధ్యనే శరద్ పవార్ కూడా తాను రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించిన సంగతి తెలిసిందే.