ఇట్స్ అఫీషియల్.. 5 నెలల తర్వాత ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ
వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగులో పలు చిత్రాల్లో నటించి విలక్షణ నటిగా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది.
దిశ, సినిమా: వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalakshmi Sarath Kumar) తెలుగులో పలు చిత్రాల్లో నటించి విలక్షణ నటిగా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. మొదట్లో హీరోయిన్గా నటించిన ఆమె ఆ తర్వాత విలన్గా నటించి మెప్పించింది. అంతేకాకుండా స్టార్ హీరోలతో నటించి ప్రతి ఏడాది ఓ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుని లక్కీ బ్యూటీగా మారిపోయింది. అయితే ఇటీవల వరలక్ష్మీ, అనిల్ కాట్జ్ (AnilKatz) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘శబరి’(Sabari Movie). యాక్షన్ థ్రిల్లర్(Action Thriller)గా తెరకెక్కించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య 2024 మే 3న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ అయింది. థ్రిల్లింగ్ అంశాలతో పాటు తల్లి కూతురు బంధంతో రూపొందిన.. ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించింది.
ఇదిలా ఉంటే.. తాజాగా, వరలక్ష్మి శరత్ కుమార్ ‘శబరి’ విడుదలైన 5 నెలల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్గా రెడీ అయింది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ సన్ నెక్స్ట్(Sun NXT) సొంతం చేసుకుంది. అయితే దసరా కానుకగా అక్టోబర్ 11 నుంచి ‘శబరి’ స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు ‘X’ వేదికగా అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందని ఓ పోస్టర్ను కూడా షేర్ చేయడంతో అది చూసిన వరలక్ష్మి ఫ్యాన్స్ ఆనంద పడుతున్నారు.