మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

దిశ, మంచిర్యాల: జిల్లాలోని జూనియర్ కళాశాలలు, మంచిర్యాల (బాలికలు), బెల్లంపల్లి (బాలికలు), చెన్నూరు latest telugu news..

Update: 2022-03-16 13:19 GMT

దిశ, మంచిర్యాల: జిల్లాలోని జూనియర్ కళాశాలలు, మంచిర్యాల (బాలికలు), బెల్లంపల్లి (బాలికలు), చెన్నూరు (బాలురు) మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల కొరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి లో నూతన అడ్మిషన్లు 6, 7, 8 తరగతుల లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం లో నూతన అడ్మిషన్ల కొరకు ప్రవేశ పరీక్ష నిర్వహించి మెరిట్ జాబితా ప్రకారం ప్రవేశాలు కల్పించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు ఏప్రిల్ 11వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

5వ తరగతి ప్రవేశ పరీక్ష మే 9వ తేదీన, 6, 7, 8 తరగతులకు ప్రవేశ పరీక్ష మే 10వ తేదీన, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశ పరీక్ష మే 21వ తేదీన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి 1 లక్షా 50 వేల రూపాయలు, పట్టణ ప్రాంతాల వారికి 2 లక్షల రూపాయల లోపు ఉండాలని, అర్హత, ఆసక్తి గల వారు ఆన్ లైన్ లో http://tmreis.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆన్ లైన్ అడ్మిషన్లకు సంబంధి వివరాల కొరకు మీ-సేవ కేంద్రాలు, మైనార్టీ గురుకుల పాఠశాలలు, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో పనివేళల్లో సంప్రదించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Tags:    

Similar News