తెలంగాణలో సంచలనం.. చనిపోయిన భర్తతో మగ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి
దిశ, వెబ్‌డెస్క్ : మహిళకు తల్లికావడం గొప్ప వరం అంటుంటారు. కానీ కొంత మందికి ఆ కోరిక తీరదు.
దిశ, వెబ్‌డెస్క్ : మహిళకు తల్లికావడం గొప్ప వరం అంటుంటారు. కానీ కొంత మందికి ఆ కోరిక తీరదు. ఇక ప్రమాదంలో భర్త చనిపోయి, పిల్లా పాపలు లేని మహిళల పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రమాదంలో భర్త చనిపోతే కొంత మంది వేరే పెళ్లి చేసుకుంటారు, మరికొందరు సింగిల్‌గానే ఉంటుంటారు. కానీ కరోనాతో భర్త చనిపోయి, అత్తమామ దగ్గరే ఉంటున్న ఓ మహిళ గొప్పగా ఆలోచన చేసింది. తన భర్త జ్ఞాపకాలను మర్చిపోలేని ఆమె.. తన జ్ఞాపకార్ధం చనిపోయిన భర్త ద్వారానే సంతానం పొందాలనుకుంది. అలా భర్త మరణం తర్వాత పండంటి మగబిడ్డకు మహిళ జన్మనిచ్చిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే.. మంచిర్యాలకు చెందిన ఓ మహిళ భర్త కరోనాతో మరణించాడు. అప్పటి వరకు వారికి పిల్లలు లేరు. దీంతో ఆమె చనిపోయిన భర్త ద్వారా బిడ్డకు జన్మ నివ్వాలనుకుంది. దాని కోసం వారు గత కొన్ని రోజుల నుంచి చికిత్స తీసుకుంటున్న సంతాన సాఫల్య కేంద్రలో 2020లో వైద్యులు పరీక్షల నిమిత్తం భార్యాభర్తల నుంచి అండం, వీర్యం సేకరించి భద్రపరిచారు. అయితే దీని ద్వారా మహిళ సంతానం పొందాలని కోరుకుంది. దీంతో ఆమె చట్టపరంగా పర్మిషన్ తీసుకోని, వైద్యుల సూచనల మేరకు ఐవీఎఫ్ చికిత్స ద్వారా మహిళ గర్భవతి అయింది. చివరకు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. భర్తలేని ఆమెకు అత్తమామలు అండగా ఉండి ఓ బిడ్డకు ప్రాణం పోశారు.
మర్రిన్ని వార్తలు: 15ఏళ్ల బాలుడితో ఆంటీ శృంగారం.. ఆమెకు ఎయిడ్స్ ఉందని తెలియడంతో!