మద్యం మత్తులో వ్యక్తి హత్య.. పోలీసుల అదుపులో నిందితుడు

దిశ, శంషాబాద్: ఒక ఐస్ కంపెనీలో వ్యక్తిపై - A man was killed under the influence of alcohol in Rangareddy district

Update: 2022-03-11 15:42 GMT
మద్యం మత్తులో వ్యక్తి హత్య.. పోలీసుల అదుపులో నిందితుడు
  • whatsapp icon

దిశ, శంషాబాద్: ఒక ఐస్ కంపెనీలో వ్యక్తిపై బండరాయితో మోది హత్య చేసిన ఘటన ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్ పహాడ్ లో జరిగింది. ఆర్జీఐఏ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్ పహాడ్ లో గల రమాకాంత్ ఐస్ కంపనీలో ఒక వ్యక్తి హత్య జరిగిందని సమాచారం రావడంతో ఘటనా స్థలానికి చేరుకొని రెండో అంతస్తులో ఉన్న హత్య జరిగిన మృతదేహాన్ని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో పరిశీలించగా మృతుడు సోమరాత్ జమిందార్ (29) అతని వద్ద ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా బీహార్ కు చెందిన వాడిగా గుర్తించామని అన్నారు.


పూర్తి వివరాలు పరిశీలించగా మరో వ్యక్తితో కలిసి మద్యం సేవించినట్లు అక్కడ దొరికిన మద్యం సీసాలను బట్టి అర్థం అవుతుందని, మద్యం సేవించడం అనంతరం ఇద్దరి మధ్య గొడవ జరిగి, పెద్ద బండరాయితో మృతుడి తలపై మోది హత్య చేసినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ఆధారంగా కాటేదాన్ లు ఇద్దరు కలిసి కాటేదాన్ వైన్ షాపుల్లో మద్యం సేవించినట్లు సీసీ ఫుటేజీలో లభ్యమయ్యాయి. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News