ఇంట్రావర్ట్స్ ఫ్రెండ్‌షిప్.. నిపుణులు అందిస్తున్న చిట్కాలు

దిశ, ఫీచర్స్ : ఇది ఫ్రెండ్‌షిప్ డే టైమ్.. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ పార్టీలు, పబ్బులు, వెకేషన్స్, ఫ్రెండ్‌షిప్ బ్యాండ్స్, హగ్స్ అంటూ ఆనందంగా గడిపేస్తుంటారు.

Update: 2022-08-07 03:06 GMT

దిశ, ఫీచర్స్ : ఇది ఫ్రెండ్‌షిప్ డే టైమ్.. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ పార్టీలు, పబ్బులు, వెకేషన్స్, ఫ్రెండ్‌షిప్ బ్యాండ్స్, హగ్స్ అంటూ ఆనందంగా గడిపేస్తుంటారు. కానీ ఇంట్రావర్ట్స్‌కు ఇదేం పట్టదు. అలాగని స్నేహాన్ని ఆస్వాదించలేరని కాదు. వారంతే అదో టైపు. అయితే అలాంటి వారు కూడా కొంతమంది స్నేహితులను సంపాదించుకుంటే లైఫ్ ఎంత అమేజింగ్‌గా ఉంటుందో వివరిస్తున్న ఎక్స్‌పర్ట్స్.. ఏ విధంగా ఫ్రెండ్‌షిప్ బిల్డ్ చేసుకోవాలో కూడా వారికి సూచనలిస్తున్నారు.

* తొలి అడుగు: ఇంట్రావర్ట్స్‌ ఏళ్ల తరబడిగా అనుభవిస్తున్న ఒంటరితనం.. వారిని శూన్యం అనే భావనలోకి నెట్టివేస్తుంది. అలాంటప్పుడు స్నేహితులను సంపాదించుకునేందుకు, అందరితో కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తూ ఒత్తిడికి గురవుతుంటారు. అలా కాకుండా ఒక్కో స్టెప్ ద్వారా ఫ్రెండ్‌షిప్ చేసేందుకు ప్రయత్నిస్తే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఒకరిద్దరు వ్యక్తులతో ఇంటరాక్ట్ అవుతూ ముందుగా సర్కిల్‌ను పరిమితం చేసుకోవాలి. తద్వారా సోషలైజింగ్ కంఫర్ట్‌గా ఉంటుంది.. ఓవర్ క్రౌడ్ లేకుండా ఈజీగా బేసిక్ ఇంటరాక్షన్స్ గురించి తెలుసుకోవచ్చు.

* ముందుగా ఒక్కరితోనే: కొన్నాళ్లుగా సెల్ఫ్ కంపెనీతో గడిపిన వ్యక్తికి సేమ్ వైబ్ కలిగిన ఫ్రెండ్ దొరకాలంటే కష్టమే. అందుకే ముందు ఒకరిని సెలెక్ట్ చేసుకుని వారి నేచర్ ఏంటి? మీ ప్రయత్నాలకు స్పందిస్తారా? లేదా తెలుసుకోవాలి. ఈ ప్రాసెస్ మొదట్లో కష్టమనిపించినా.. ఇంటరాక్షన్ కంటిన్యూ అవుతున్న టైమ్‌లో వారి వైబ్ క్యాచ్ చేయడం నేర్చుకుంటారు.

* క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యం: పది మంది అన్‌స్టేబుల్ ఫ్రెండ్స్ కన్నా స్థిరంగా మన కోసం ఆలోచించే, కష్టాల్లో ఆదుకునే స్నేహితులు ముఖ్యం. ఫ్రెండ్స్ లిస్ట్ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. లేదంటే జీవితాలు హరించిపోతాయి. ఫ్రెండ్స్ లిస్ట్ పెద్దగా ఉంటే ఇంట్రావర్ట్ స్వభావానికి అస్సలు సెట్ కాదు.

* ప్రయత్నాన్ని బలోపేతం చేయాలి: ఇంతకు ముందెన్నడూ ప్రయత్నించని విధంగా స్నేహం కోసం పరితపిస్తున్నప్పుడు మీ శక్తిని పెట్టుబడిగా పెట్టడంలో తప్పులేదు. ఇలాంటి సమయంలో ఎదుటివారితో ఎంగేజ్ అవడం కష్టమనిపించినా.. ప్రయత్నాలు కచ్చితంగా ఫలితాన్నిస్తాయి. పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఉంటే మంచి దోస్త్ దొరుకుతాడనడంలో సందేహం లేదు.

* పోలిక మానుకోవాలి: స్నేహాన్ని పెంపొందించుకునేందుకు ముందుకు సాగే క్రమంలో సానుకూల అనుభవాలు పొందేందుకు ప్రయత్నించాలి. ఇతరులతో స్నేహితులను పోల్చేందుకు దూరంగా ఉండాలి. వ్యత్యాసాలను గుర్తించి పూర్తిగా స్వీకరించాలి.

Tags:    

Similar News