కరోనా వలన 2.15 కోట్ల ఉద్యోగాలు హాంఫట్.. పర్యాటక రంగం అతలాకుతలం

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సమయంలో పర్యాటక రంగంలో అనేక మంది ఉపాధి ..telugu latest news

Update: 2022-03-14 11:03 GMT
కరోనా వలన 2.15 కోట్ల ఉద్యోగాలు హాంఫట్.. పర్యాటక రంగం అతలాకుతలం
  • whatsapp icon

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సమయంలో పర్యాటక రంగంలో అనేక మంది ఉపాధి కోల్పోయినట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. కేవలం రెండేళ్ల వ్యవధిలో 2.15కోట్ల ఉద్యోగాలు పోయాయని చెప్పారు. ఈ మేరకు సోమవారం ప్రారంభమైన లోక్‌సభ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా మొదటి వేవ్ సమయంలో 93 శాతం పర్యాటకం పడిపోగా, రెండో వేవ్ సమయంలో 79 శాతం, మూడో వేవ్ సమయంలో 64 శాతం పడిపోయినట్లు తెలిపారు. మేము పర్యాటక రంగంపై కరోనా మహమ్మారి ప్రభావాన్ని అంచనా వేసేందుకు సర్వే నిర్వహించాం. ఈ నివేదిక ప్రకారం మొదటి వేవ్ సమయంలో 1.45 కోట్లు, రెండో వేవ్ సమయంలో 52 లక్షలు, మూడో వేవ్ సమయంలో 18 లక్షల మంది నిరుద్యోగులయ్యారు' అని తెలిపారు.

కరోనాకు ముందు వరకు 3.8 కోట్ల మంది పర్యాటక పరిశ్రమ పై ఆధారపడి ఉన్నారని వెల్లడించారు. ఈ మూడు వేవ్‌ల సమయంలో దేశ పర్యాటక ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పడిపోయిందని మంత్రి అన్నారు. అయితే ఒక్క మన దేశంలో కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని చెప్పారు. కాగా, ఈ రంగానికి ఊతం ఇచ్చేందుకు సంబంధిత రంగం వాటాదారులకు రూ.10 లక్షల వడ్డీ లేని రుణం, పర్యాటక గైడ్లకు రూ.లక్ష వరకు ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి పునర్‌వైభవం తీసుకువచ్చేందుకు సాధ్యమైనంత సాయం చేయాలని కోరారు.

Tags:    

Similar News