Nalgonda: తల్లి బతికుండగానే రైతు బీమా సొమ్ము స్వాహా చేసిన కొడుకు..

Son Creates fake Death Documents of mother for Rythu Bima Money while mother alive in Nalgonda| తల్లి బతికుండగానే రైతు బీమా సొమ్ము స్వాహా చేసిన కొడుకు.. ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు

Update: 2022-08-01 13:08 GMT

దిశ, మిర్యాలగూడ : Son Creates fake Death Documents of mother for Rythu Bima Money while mother alive in Nalgonda| తల్లి బతికుండగానే రైతు బీమా సొమ్ము స్వాహా చేసిన కొడుకు.. ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామానికి చెందిన కోలా లింగమ్మ పేరిట లక్ష్మీదేవి గూడెం పరిధిలో 9 గుంటల వ్యవసాయ భూమి ఉంది. గ్రామ ఉప సర్పంచ్, ఆమె సమీప బంధువైన కోల సైదులు అనే వ్యక్తి లింగమ్మ చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ తీశాడు. నామినీగా ఉన్న లింగమ్మ కొడుకు వీరస్వామి తో కలిసి 2021 ఏప్రిల్ నెలలో వేములపల్లి వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతు బీమాకు దరఖాస్తు చేశారు. దీంతో వారం రోజుల్లో బీమా సొమ్ము రూ. 5 లక్షలు కొడుకు వీరస్వామి ఖాతాలో జమ అయింది. అయితే ఇటీవల బాధిత మహిళ లింగమ్మ బీమా స్కీమ్ రెన్యువల్ చేసేందుకు వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్ళింది. భూమి వివరాలు చూసిన అధికారులు లింగమ్మ చనిపోయినట్లు నమోదు కావడంతో కంగు తిన్నారు. డెత్ సర్టిఫికెట్ సృష్టించి బీమా సొమ్ము స్వాహా చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. దీంతో సైదులు, వీరాస్వామి లపై వేములపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: మరో వివాదంలో మంత్రి మల్లారెడ్డి.. పాఠశాలలో విద్యార్థులతో అలా చేయిస్తారా..? (వీడియో)

Tags:    

Similar News