సమరానికి సై అంటున్న సిద్ధు జొన్నలగడ్డ.. కత్తి పట్టుకొని అందరికీ పెద్ద షాకే ఇచ్చాడుగా..!

సినీ ఇండస్ట్రీలో ఉన్న డీజే టిల్లుతో ఒక్కసారిగా స్టార్ హీరో అయ్యాడు సిద్ధూ జొన్నలగడ్డ.

Update: 2024-10-12 06:45 GMT

దిశ, వెబ్ డెస్క్ :  సినీ ఇండస్ట్రీలో ఉన్న డీజే టిల్లుతో ఒక్కసారిగా స్టార్ హీరో అయ్యాడు సిద్ధూ జొన్నలగడ్డ. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. నేడు దసరా పండగ వేళా సిద్ధూ భారీ ప్రాజెక్ట్ ను ప్రకటించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై రవికాంత్ ప్రేరేపు డైరెక్షన్ లో

కోహినూర్ అనే కొత్త మూవీని అనౌన్స్ చేసారు. కోహినూర్ – పార్ట్ 1 అని పోస్టర్ కూడా విడుదల చేయడంతో ఈ మూవీ పోస్టర్ సిద్ధూ కత్తి పట్టుకొని కోహినూర్ వజ్రం పట్టుకొని ఉన్నాడు. ఇక ఈ మూవీని 2026 జనవరిలో విడుదల చేస్తామని మూవీ యూనిట్ తెలిపారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతుంది కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి.

సిద్ధు జొన్నలగడ్డ ఆల్రెడీ డైరెక్టర్ రవికాంత్ తో ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ మూవీ తీసి హిట్ కొట్టాడు. ఇక సితార నిర్మాణ సంస్థతో ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ మూవీస్ తీసి ఎంత పెద్ద హిట్ కొట్టాడో మనందరికీ తెలిసిందే. ఈ కాంబోలో హిట్ కొడతారని అందరూ భావిస్తున్నారు .. రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి!


Similar News