అవయవాల గొప్పతనాన్ని చాటిచెప్పే ‘స్వార్థం’

దిశ, సినిమా : ప్లాటినం, బంగారం, వెండి కన్నా మానవ అవయవాలు విలువైనవి అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ‘స్వార్థం’. సమాజానికి ఈ సందేశాన్ని ఇవ్వాలనే ఆలోచనతో తెలుగు టెకీలు నాలుగేళ్లుగా కష్టపడి రూపొందించిన ఈ సినిమా.. ఎనిమిది అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా మూవీ యూనిట్‌ను సన్మానించింది టీటా. అవయవదానంపై సొసైటీలో పూర్తిగా అవగాహన లేదనే అభిప్రాయంగల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, నటుడు, రచయిత ఆలోచనే సినిమా రూపొందించేందుకు కారణం కాగా.. […]

Update: 2021-02-19 09:06 GMT

దిశ, సినిమా : ప్లాటినం, బంగారం, వెండి కన్నా మానవ అవయవాలు విలువైనవి అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ‘స్వార్థం’. సమాజానికి ఈ సందేశాన్ని ఇవ్వాలనే ఆలోచనతో తెలుగు టెకీలు నాలుగేళ్లుగా కష్టపడి రూపొందించిన ఈ సినిమా.. ఎనిమిది అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా మూవీ యూనిట్‌ను సన్మానించింది టీటా.

అవయవదానంపై సొసైటీలో పూర్తిగా అవగాహన లేదనే అభిప్రాయంగల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, నటుడు, రచయిత ఆలోచనే సినిమా రూపొందించేందుకు కారణం కాగా.. తన ఫ్రెండ్స్‌తో కలిసి ఈ శక్తివంతమైన సినిమాను ప్రజల్లోకి తీసుకువచ్చారని చెప్పారు గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టీమ్ వర్క్స్ ఆధ్వర్యంలో డాక్టర్ సోమశేఖర రెడ్డి సినిమాను నిర్మించగా.. ఈస్ట్ వెస్ట్ ఎంటర్‌టైన్మెంట్స్ ద్వారా అమెరికా, యూకే, కెనడాల్లో ఓటీటీలో సినిమా రిలీజైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, ఎంఎక్స్ ప్లేయర్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్, హంగామా, వొడాఫోన్.ఇన్‌లో ‘స్వార్థం’ సినిమా అందుబాటులో ఉంది.

Tags:    

Similar News