ప్రీపెయిడ్ వ్యాలిడిటీ పొడిగించిన టెలికాం సంస్థలు!
దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ సర్వీసు వినియోగదారుల వ్యాలిడిటీని మే 3 వరకు పొడిగించాయి. రిలయన్స్ జియో వేలాది మంది తక్కువ ఆదాయం ఉన్న వినియోగదారుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుందని, తక్కువ ఆదాయం ఉన్న వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా, ప్రస్తుత పరిస్థితుల్లో రీఛార్జ్ చేయలేకపోతున్న ప్రతి ఒక్కరికీ ఈ ప్రయోజనం ఉపయోగపడుతుందని రిలయన్స్ జియో తన ప్రకటనలో తెలిపింది. జీయో యాప్, జియో వెబ్‌సైట్ ద్వారా […]
దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ సర్వీసు వినియోగదారుల వ్యాలిడిటీని మే 3 వరకు పొడిగించాయి. రిలయన్స్ జియో వేలాది మంది తక్కువ ఆదాయం ఉన్న వినియోగదారుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుందని, తక్కువ ఆదాయం ఉన్న వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా, ప్రస్తుత పరిస్థితుల్లో రీఛార్జ్ చేయలేకపోతున్న ప్రతి ఒక్కరికీ ఈ ప్రయోజనం ఉపయోగపడుతుందని రిలయన్స్ జియో తన ప్రకటనలో తెలిపింది. జీయో యాప్, జియో వెబ్‌సైట్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని సంస్థ వివరించింది.
ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కూడా తమ చందాదారుల చెల్లుబాటును మే 3 వరకు పొడిగించాయి. ప్రీపెయిడ్ ఖాతాదారులు రీఛార్జ్ చేయడంలో ఉన్న ఇబ్బందులను, కనెక్టివిటీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎయిర్‌టెల్ తెలిపింది. ఇన్‌కమింగ్ సర్వీస్ వ్యాలిడిటీ పొడిగింపుతో తమ వినియోగదారులకు ఇబ్బందులను నుంచి ఉపశమనం ఉంటుందని వొడాఫోన్ ఐడియా వెల్లడించింది.
Tags: extend prepaid validity, prepaid validity, Reliance Jio, Reliance Jio Validity, Airtel, Vodafone Idea