బీఆర్ఎస్‌కు మరో BIG షాక్.. రేవంత్‌తో BRS ఎమ్మెల్యే భేటీ!

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మరో ఎమ్మెల్యే పార్టీకి గుడ్ చెప్పేందుకు సిద్దమవుతున్నారు.

Update: 2023-10-17 06:35 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మరో ఎమ్మెల్యే పార్టీకి గుడ్ చెప్పేందుకు సిద్దమవుతున్నారు. ఇవాళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నివాసానికి ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన బాపురావును బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇవ్వకుండా పక్కనబెట్టింది. ఆయన స్థానంలో అనిల్ జాదవ్ అనే నేతకు టికెట్ కేటాయించింది. దీంతో అసంతృప్తితో ఉన్న నేత బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. త్వరలోనే కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Tags:    

Similar News