ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్‌కు భారీ ఎదురుదెబ్బ

ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కారు గుర్తును పోలిన సింబల్స్ ఇతరులకు కేటాయించొద్దని వాటిని ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలంటూ బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Update: 2023-10-20 06:06 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కారు గుర్తును పోలిన సింబల్స్ ఇతరులకు కేటాయించొద్దని వాటిని ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలంటూ బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. గత ఎన్నికల్లో తమ పార్టీపై తీవ్ర ప్రభావం చూపిన రోడ్డు రోలర్ వంటి కారును పోలిన సింబల్స్‌ను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. అయితే గుర్తుల తొలగింపు కుదరదని ఈసీ బదులిచ్చింది. తాజాగా ఈసీ విడుదల చేసిన గుర్తుల జాబితాలో రోడ్డు రోలర్ సహా బీఆర్ఎస్ అభ్యంతరం చెబుతున్న గుర్తులు యధాతథంగా ఉన్నాయి.

ఈ క్రమంలోనే గుర్తుల వివాదానికి సంబంధించి బీఆర్ఎస్ ఇటీవలే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే తొలి విచారణ సందర్భంగానే తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం కారు గుర్తును పోలిన వాటిని తొలగించాలని సుప్రీంకోర్టును ఆశ్రయిచింది. ఇందులో కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రతివాదిగా చేర్చింది. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన సుప్రీంకోర్టు బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

Tags:    

Similar News