రేవంత్ రెడ్డికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ.. భద్రత పెంచేది అప్పుడే..!

సీఎంగా రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.

Update: 2023-12-06 02:43 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: సీఎంగా రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఆయన ఈ నెల7న ప్రమాణస్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రేవంత్ రెడ్డికి జెడ్ ప్లస్ సెక్యూరిటీని కల్పించనున్నట్లు తెలిసింది. అయితే దీని కోసం పార్టీ తరపున గవర్నర్‌కు అభ్యర్థన పంపించాల్సి ఉంటుంది. అలా కాని పక్షంలో జడ్ కేటగిరి కింద కింద భద్రతా ఏర్పాట్లు ఉంటాయని ఓ సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు.

55 మంది సిబ్బంది

జెడ్ ప్లస్ భద్రతలో మొత్తం 55 మంది భద్రతా విధులు నిర్వర్తిస్తారు. వీరిలో 10 మంది ఎన్ఎస్జీ కమాండోలు ఉంటారు. సీఎం కాన్వాయ్‌లో 5 లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలో బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉంటాయి. వీటితో పాటు ఓ జామర్ కూడా ఉంటుంది. ఇక, ముఖ్యమంత్రి భద్రతా విధుల్లో ఉండే ఎన్ఎస్జీ కమాండోల వద్ద వివిధ రకాల మిషన్ గన్లు ఉంటాయి. దీంతో పాటు అత్యంత అధునాతన కమ్యూనికేషన్ ఎక్విప్ మెంట్ ఉంటుంది.

జెడ్ కేటగిరీ అయితే...

జెడ్ కేటగిరీ కింద అయితే భద్రతా విధుల్లో 22 మంది ఉంటారు. వీరిలో నలుగురి నుంచి ఆరుగురు ఎన్ఎస్జీ కమాండోలు ఉంటారు. ఈ కేటగిరీలో 5 కార్లు ఉంటాయి. వీటిలో ఒక బుల్లెట్ ప్రూఫ్ కారు ఉంటుంది. అయితే, ముఖ్యమంత్రులకు సాధారణంగా జెడ్ ప్లస్ కేటగిరీ ప్రకారం భద్రతా ఏర్పాట్లు ఉంటాయి.

Also Read: నేడు ఢిల్లీ పెద్దలతో రేవంత్ రెడ్డి కీలక భేటీ!


Similar News