YS Viveka Case : ఆరు రోజుల పాటు ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ

మాజీ మంత్రి వైఎస్ వివేకా మర్డర్ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ ఆరు రోజుల పాటు విచారించనుంది.

Update: 2023-04-19 05:48 GMT
YS Viveka Case : ఆరు రోజుల పాటు ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి వైఎస్ వివేకా మర్డర్ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ ఆరు రోజుల పాటు విచారించనుంది. నేటి నుంచి ఈ నెల 24 వరకు ఈ విచారణ కొనసాగనుంది. అయితే తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డిని ఈనెల 25 వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. అవినాష్ రెడ్డి విచారణను ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని కోర్టు తెలిపింది. విచారణ సమయంలో లిఖిత పూర్వకంగానే ప్రశ్నలు ఇవ్వాలని కోర్టు సూచించింది. అయితే ఈ నెల 25న తుది తీర్పు ఉన్నందున సీబీఐ అవినాష్ రెడ్డితో పాటు, భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను కలిపి విచారించనుంది. అవినాష్ రెడ్డి విచారణ నేపథ్యంలో ఈ కేసులో ఏం జరగబోతోందోననే ఉత్కంఠ నెలకొంది. 

Read more:

అధికార పక్షంలో అంతులేని కలవరం.. ముందస్తుకే మొగ్గు!

Tags:    

Similar News