కేసీఆర్.. రైతులను మోసగిస్తున్న 420: సీఎంపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను మోసగిస్తున్న 420 అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల శనివారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.

Update: 2023-04-22 14:52 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను మోసగిస్తున్న 420 అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల శనివారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. అకాల వర్షాలకు నష్టపోయిన ప్రతి ఎకరాకు పది రోజుల్లో పరిహారం ఇస్తామని కమ్మటి మాటలు పలికిన దొర.. ఇప్పటివరకు రూపాయి ఇవ్వలేదని విమర్శలు చేశారు. కేసీఆర్ బుద్ధి తేనెపూసిన కత్తి అని మరోసారి తేలిపోయిందని చురకలంటించారు. తొలుత 2.28 లక్షల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని లెక్కలుగట్టి, చివరకు 1.51లక్షల ఎకరాల్లో మాత్రమేనని తేల్చి, రైతుల నోట్లో మట్టి కొట్టాడని విరుచుకుపడ్డారు.

అన్నదాతలను ఆదుకుందామన్న సోయి కేసీఆర్‌కు లేదని, కానీ తమది కిసాన్ సర్కార్ అని పక్క రాష్ట్రాల్లో దొంగ ప్రచారం చేసుకోవడం మాత్రం ఆయనకు చేతనైందని ధ్వజమెత్తారు. ఏడాది కింద నష్టపోయిన రైతులకు సైతం పరిహారం సీఎం ఎగ్గొట్టాడని మండిపడ్డారు. ఇప్పుడు కూడా పైసా ఇవ్వకుండా నాన్చుడు ధోరణితో ఉన్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పి, నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ.10వేలు కాకుండా వరి పంటకు రూ.25 వేలు, మిర్చి, మొక్కజొన్న పంటకు రూ.50వేలు, మామిడికి రూ.75 వేలు ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు.

Tags:    

Similar News