YS వివేకా హత్యకు ఆయుధం కొన్నది అతడే: వైఎస్ భాస్కర్ రెడ్డి

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి సోమవారం తెలంగాణ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Update: 2023-03-20 09:12 GMT
YS వివేకా హత్యకు ఆయుధం కొన్నది అతడే: వైఎస్ భాస్కర్ రెడ్డి
  • whatsapp icon

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి సోమవారం తెలంగాణ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసులో నాలుగవ నిందితునిగా ఉన్న దస్తగిరిని అప్రూవర్‌గా పేర్కొనటాన్ని ఇందులో సవాల్ చేశారు. వివేకానంద హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని కొన్నది దస్తగిరి అని తెలిపారు. దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగానే సీబీఐ ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని విచారిస్తున్న విషయం తెలిసిందే. నిజానికి సీబీఐ చెప్పినట్టుగా దస్తగిరి స్టేట్మెంట్లు ఇస్తున్నట్టు భాస్కర్ రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. అందుకే అతనికి బెయిల్ రావటంలో సీబీఐ సహకరించిందని తెలిపారు. దస్తగిరికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలను కింది కోర్టు పట్టించుకోలేదన్నారు. దస్తగిరి బెయిల్‌ని రద్దు చెయ్యాలని పేర్కొన్నారు.

Tags:    

Similar News