అత్యాచారం కేసు: భద్రాద్రి కొత్తగూడెం కోర్టు సంచలన తీర్పు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 16 నెలల చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో కొత్తగూడెం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

Update: 2023-02-23 10:43 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 16 నెలల చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో కొత్తగూడెం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పోక్సో కేసులో నిందితుడు అజ్మీరా సాయి కిరణ్‌కు 25 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ పోక్సో కేసుల మొదటి అదనపు సెషన్స్‌ కోర్టు తీర్పు వెలువరించింది. జరిమానా చెల్లించలేని పక్షంలో 6 నెలల కఠిన కారాగార శిక్ష అదనంగా ఉంటుందని స్పష్టం చేసింది. దుమ్ముగూడెం మండలం తురుబాక గ్రామానికి చెందిన అజ్మీరా సాయి కిరణ్ (22) అనే యువకుడు జూన్ 24, 2018న 16 నెలల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

అప్పటి దుమ్ముగూడెం ఎస్ఐ బాలకృష్ణ ఈ కేసు నమోదు చేయగా, అప్పటి భద్రాచలం ఏఎస్పీ, ప్రస్తుత టీఎస్‌ఆర్టీసీ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌ విచారణ అధికారిగా ఉన్నారు. ఈ కేసులో చిన్నారి తల్లిదండ్రులతో సహా 12 మంది సాక్షులను విచారించారు. పోక్సో చట్టం కింద 20 ఏళ్ల జైలుశిక్ష ఉన్నప్పటికీ, తెలంగాణలో 25 ఏళ్ల శిక్ష అరుదైనది. ఇతర రాష్ట్రాల్లోనూ పోక్సో చట్టం కింద 25 ఏళ్ల శిక్షలు చాలా తక్కువగా నమోదు కావడం గమనార్హం.

సంగ్రామ్ పాటిల్‌ను సన్మానించిన సజ్జనార్‌

చిన్నారిపై అత్యాచారం కేసులో నిందితుడికి శిక్ష పడేలా పకడ్బందీగా కేసును దర్యాప్తు చేసిన సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌ను టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనర్‌ అభినందించారు. హైదరాబాద్‌ బస్‌భవన్‌లో గురువారం ఆయనను సన్మానించారు. బాధిత కుటుంబానికి వేగంగా న్యాయం అందేలా చర్యలు తీసుకున్న సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌ను ప్రశంసించారు. ఈ నేపథ్యంలో సంగ్రామ్ పాటిల్ మాట్లాడుతు...తన మొదటి సంచలన కేసులోనే చారిత్రాత్మక తీర్పు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కేసులో తన వృత్తి ధర్మాన్ని నిర్వహించానని, ఈ అనుభవంతో భవిష్యత్‌లో మరింత సమర్థవంతంగా పనిచేస్తానని చెప్పారు.

Tags:    

Similar News