పంచాయితీ కొలిక్కి‌ వచ్చేనా!?

సింగరేణి స్థలం ఆక్రమణ, గృహ నిర్మాణం పంచాయితీ కొలిక్కి వచ్చేనా..?

Update: 2023-02-28 02:43 GMT
పంచాయితీ కొలిక్కి‌ వచ్చేనా!?
  • whatsapp icon

దిశ, మందమర్రి : మందమర్రిలోని ఒక కార్యాలయంలో సోమవారం కొంతమంది పట్టణ ప్రముఖ నేతలు తలపెట్టిన సింగరేణి స్థలం ఆక్రమణ, గృహ నిర్మాణం పంచాయతీ కొలిక్కి వచ్చేనా..? అనే సందేహాలు పట్టణంలో సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. 1వ జోన్‌లో ఒక గృహ నిర్మాణంలో గత 15 రోజులుగా ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాలు బాహాబాహీగా తలపడుతున్నట్లు సమాచారం.

ఈ విషయంలో పట్టణ కమిటీ నాయకులు, యూనియన్ నాయకులు సద్ది చెప్పినప్పటికీ వారు ససేమిరా అంటున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. తమ వారు కొనుగోలు చేసిన స్థలంలో తాము గృహాన్ని నిర్మించుకుంటున్నామని ఒక వర్గం అంటుండగా మరో వ్యక్తి తాము గత 50సంవత్సరాలుగా స్థలాన్ని కాపాడుకుంటుంటే దానిని కబ్జా చేయడం సరికాదని పార్టీ అనునాయులతో వాపోయినట్లు సమాచారం. కాగా, ఇరు వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం ఆ పార్టీ నేతలకు సర్ది చెప్పడం పట్టణంలో చర్చనీయాంశంగా మారిందనే చెప్పవచ్చు.

ఈ విషయాన్ని మంచిర్యాల జిల్లా బాస్ దృష్టికి తీసుకెళ్లగా పరస్పర సంప్రదింపులతో సమస్యను పరిష్కారం చేసుకోవాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆ సూచనలో భాగంగా సోమవారం ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఆ కార్యాలయంలో చర్చలు, బాహాబాహీలు, సంప్రదింపులు, నచ్చజెప్పడాలు జరిగిన్నట్లు సమాచారం.

కార్యాలయానికి వచ్చిన నేతలు హౌరా ఏమి విడ్డూరమంటూ ముక్కున వేలేసుకుని తిరిగి వెళ్లి పోయినట్లు పట్టణంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇరువురిలో ఎవరికి ఏం చెప్పాలో తెలియక నేతలు తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం. ఏది ఏమైనా 6గంటల పంచాయితీ ఎటు తేలుతుందో వేచి చూడాల్సిందే. సమస్య సద్దుబాటు కోసం జట్టు కట్టిన 100మంది పట్టణ ప్రముఖ నేతలు పట్టణ ప్రగతికి కూడా జట్టు కట్టి ఆ పార్టీకి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆ పార్టీ శ్రేణులు కోరుతున్నారు.

Tags:    

Similar News