కాంగ్రెస్ కోరితే మునుగోడులో పోటీ చేస్తా : Cheruku Sudhakar

Will Contest From Munugode if Congress Permits, Says Cheruku Sudhakar| కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మునుగోడు లో పోటీ చేయమని కోరితే బరిలో దిగుతానని చెరుకు సుధాకర్ తెలిపారు. గురువారం మాణిక్కం ఠాగూర్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను మర్యాదపూర్వకంగానే ఠాగూర్‌ని

Update: 2022-08-11 08:59 GMT
Will Contest From Munugode if Congress Permits, Says Cheruku Sudhakar
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో : Will Contest From Munugode if Congress Permits, Says Cheruku Sudhakar| కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మునుగోడు లో పోటీ చేయమని కోరితే బరిలో దిగుతానని చెరుకు సుధాకర్ తెలిపారు. గురువారం మాణిక్కం ఠాగూర్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను మర్యాదపూర్వకంగానే ఠాగూర్‌ని కలిశానని అన్నారు. ఈ చర్చల్లో పార్టీ టిక్కెట్టు గురించి ఎటువంటి చర్చలు జరగలేదని, కేవలం పార్టీ వ్యవహారాలపై మాత్రమే భేటీ అయ్యామని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్‌కు తాను మంచి మిత్రుడినని, కాంగ్రెస్ కోసం ఏం చేయమని అడిగినా చేస్తానని తెలిపారు. ఒకవేళ పార్టీ పోటీ చేయమని కోరితే చేస్తానన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి వ్యతిరేకంగా నేను ఎప్పుడు పని చేయలేదని చెరుకు సుధాకర్ విలేఖరులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. 

ఇది కూడా చదవండి: తన లక్ష్యం అదే.. బీజేపీలో సీఎం అభ్యర్థిపై ఈటల క్లారిటీ!

Tags:    

Similar News