ప్రశాంత్‌తో బండిసంజయ్.. వందల సార్లు ఎందుకు మాట్లాడారు..?

టెన్త్ పేపర్​లీకేజీలో అరెస్టైన ప్రశాంత్, బీజేపీ ఎంపీ బండి సంజయ్​తో వందల ఫోన్​కాల్స్​ఎందుకు? మాట్లాడారు?

Update: 2023-04-05 16:25 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: టెన్త్ పేపర్​లీకేజీలో అరెస్టైన ప్రశాంత్, బీజేపీ ఎంపీ బండి సంజయ్​తో వందల ఫోన్​కాల్స్​ఎందుకు? మాట్లాడారు? అని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉన్నదని కాంగ్రెస్​సీనియర్​నేత మల్లు రవి ప్రభుత్వాన్ని కోరారు. వాళ్లిద్దరి కాన్వర్జేషన్స్​పై అనుమానం ఉన్నదన్నారు. గంటల వ్యవధిలోనే అన్ని కాల్స్​చేయడం ఆశ్చర్యంగా ఉన్నదన్నారు.పోలీసులు అన్ని కోణాల్లో విచారించాల్సిన అవసరం ఉన్నదన్నారు. గాంధీ భవన్​లో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ..ప్రశాంత్​,బండి ఫోన్లను పరిశీలించాల్సిన అవసరం ఉన్నదన్నారు.

అప్పుడే నిజాలు బయటకు వస్తాయన్నారు. ఇక రాష్ట్రంలో రాజకీయ డ్రామా రసకందాయకంగా నడుస్తోందన్నారు. టీఎస్​పీఎస్సీ పేపర్​లీకేజ్​లో రెండు వారాల తర్వాత చైర్మన్​విచారించడం ఏందని? ప్రశ్నించారు. సిట్​తో జాప్యం జరుగుతుందని, సీబీఐ ఎంక్వైరీ వేయాలని అఖిల పక్షం కోరిందని, కానీ సర్కార్ స్పందించలేదన్నారు. ఎగ్జామినేషన్ సిస్టంను పనిచేయించే వ్యవస్థ ప్రభుత్వం దగ్గర లేదని ఫైర్​అయ్యారు. ప్రజా సమస్యలు పక్క దారి పట్టేందుకే బీఆర్​ఎస్​, బీజేపీలు కొత్త నాటకాన్ని తెరమీదకు తీసుకువచ్చాయన్నారు.

Tags:    

Similar News