రేవంత్ రెడ్డి హామీ ఏమైంది..? పెళ్లిలో నవదంపతుల విన్నూత్న నిరసన
తులం బంగారం కోసం పెళ్లిలో నవ దంపతులు విన్నూత్న నిరసన చేపట్టారు.

దిశ, వెబ్ డెస్క్: తులం బంగారం కోసం పెళ్లిలో నవ దంపతులు విన్నూత్న నిరసన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి వచ్చాక కళ్యాణ లక్ష్మి పథకం (Kalyana Lakshmi Scheme)లో భాగంగా వధువుకు ఇచ్చే రూ. లక్షతో పాటు తులం బంగారం (10 Gram Gold) కూడా ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయం (Assembly Elections Time)లో హామీ ఇచ్చింది. అయితే దీనిపై ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) ఇచ్చోడ మండలం (Ichoda Mandal)లోని ముక్రా(కే) గ్రామంలో నిర్వహించిన ఓ పెండ్లిలో వధూవరులు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం ఏమైంది? అని ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ (Rahul Gandhi), సోనియా గాంధీ (Sonia Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)లను ప్లకార్డుల ద్వారా ప్రశ్నిస్తున్నారు. వధూవరులు కాంబ్లే ఆమోల్ – గీతాంజలి పెళ్లి పీటల మీదనే ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలపడంతో.. వారి తల్లిదండ్రులు బంధువులు కూడా మద్దతుగా నిలిచారు. హామీ ఇచ్చిన విధంగా పెళ్లి అయిన ప్రతీ ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం కూడా ఇవ్వాలని వారు కోరారు.