KTR : సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేకుండా గుణపాఠం చెబుతాం : కేటీఆర్

లగచర్ల(Lagacharla) ఫార్మా బాధిత రైతులను నాలుగు రోజుల పాటు జైలులో పెట్టవచ్చని, కాని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కి రాజకీయ భవిష్యత్తు లేకుండా గుణపాఠం చెబుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) హెచ్చరించారు.

Update: 2024-11-23 07:37 GMT

దిశ, వెబ్ డెస్క్ : లగచర్ల(Lagacharla) ఫార్మా బాధిత రైతులను నాలుగు రోజుల పాటు జైలులో పెట్టవచ్చని, కాని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కి రాజకీయ భవిష్యత్తు లేకుండా గుణపాఠం చెబుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) హెచ్చరించారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలులో ములాఖత్ లో కలిసి కేటీఆర్ పరామర్శించారు.కేటీఆర్ వెంట ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి భార్య శృతి , మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మ‌హ‌ముద్ అలీ, ఎమ్మెల్యే బండారు ల‌క్ష్మారెడ్డిలు ఉన్నారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. జైలులో నరేందర్ రెడ్డి ధైర్యంగా ఉన్నారని, నా కోసం కాదని..మా కొడంగల్ రైతుల పక్షాన కొట్లాడాలని మమ్మల్ని కోరడం జరిగిందని తెలిపారు. బడుగు రైతుల భూములను గుంజుకుంటున్నారని వారికి అండగా నిలబడాలని, జైలు పాలైన రైతు కుటుంబాల కోసం కొట్లాడాలని నరేందర్ రెడ్డి తమను కోరినట్లుగా చెప్పారు. రైతుల తరుపున పోరాటం కొనసాగించాలని చెప్పిన నరేందర్ రెడ్డి తన మాటలతో మాకు ఉత్సహాన్ని అందించాడన్నారు. రేవంత్ రెడ్డి రాజకీయ కక్షతో పెట్టిన అక్రమ కేసులో నరేందర్ రెడ్డి జైలులో పాలయ్యాడన్నారు.

సొంత నియోజకవర్గమైతే రేవంత్ రెడ్డి ఏమి రారాజు కాదని, నీలాంటి నియంతలు ఎందరో పోయారన్నారు. మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఇంటికి అడ్డంగా గోడ కట్టి సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు చేసిన అవమానంతోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. కొడంగల్ నుంచి కొండారెడ్డి పల్లి దాకా శిశుపాలుని మాదిరిగా రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పులను ప్రజలు లెక్క గడుతున్నారని, పాపం పండే రోజు దగ్గరలో ఉందన్నారు. భూ కుంభకోణాలు, ఫార్మా విలేజీల పేరిట దౌర్జన్యాలు, పేద గిరిజన, రైతుల కుటుంబాలపై అర్ధరాత్రి బందీపోట్ల మాదిరిగా వందల మంది పోలీసులతో దాడి చేయించడం, సాయిరెడ్డి, గురువారెడ్డి లాంటి వారిపై ఒత్తిడి తెచ్చి ఆత్మహత్య చేసుకునేలా చేస్తున్న రేవంత్ రెడ్డి దుర్మార్గాలకు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. జైలులో ఉన్న 30మంది పేద గిరిజన కుటుంబాలకు కేసీఆర్ అండగా ఉన్నారని, తప్పకుండా న్యాయం ధర్మం గెలుస్తుందని, కోర్టుల్లో న్యాయపోరాటం కొనసాగిస్తామన్నారు.

Tags:    

Similar News