Mahesh Kumar Goud: సరిగ్గా ఏడాది క్రితం రాష్ట్రంలో నియంత పాలనకు చరమ గీతం: మహేశ్ కుమార్ గౌడ్

కాంగ్రెస్ ఏడాది పాలనపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు.

Update: 2024-12-03 07:26 GMT
Mahesh Kumar Goud: సరిగ్గా ఏడాది క్రితం రాష్ట్రంలో నియంత పాలనకు చరమ గీతం: మహేశ్ కుమార్ గౌడ్
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka),  మంత్రుల సమిష్టి నిర్ణయాలతో కాంగ్రెస్ ఏడాది పాలనలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో వెలిగిపోతున్నదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud) అన్నారు. ఈ ఏడాది కాలంలో దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయలేనంత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి ప్రజల మన్ననలు పొందిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాపాలనకు (Congress One Year Administration) ఏడాది పూర్తి అయిన సందర్భంగా మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సరిగ్గా ఏడాది క్రితం రాష్ట్రంలో నియంత పాలనకు చరమ గీతం పాడి ప్రజా పాలన ఏర్పాటుకు తెలంగాణ ప్రజలు సంపూర్ణంగా సహకరించారు. గడీల పాలన, ఫామ్ హౌస్ పాలనతో విసిగిపోయి, అవినీతి, కుటుంబ పాలనకు స్వస్తి పలికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సంపూర్ణ మెజారిటీ ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

ప్రజల నిర్ణయంతో నేడు రాష్ట్రం రైసింగ్ తెలంగాణగా (Rising Telangana) దూసుకుపోతున్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన ప్రజలకు, ఆయా నియోజక వర్గాలలో ప్రజల మనసులను గెలిచి విజయం సాధించిన శాసన సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ జర్నీ, ఆరోగ్యో శ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 కే గ్యాస్ కనెక్షన్లు, రైతులకు పంట రుణమాఫీ, ధాన్యానికి రూ,.500 బోనస్ ఇచ్చి మాట నిలబెట్టుకున్నామన్నారు. రాష్ట్రంలో ఒక్క ఏడాది లోనే సుమారు 54 వేల 500 ఉద్యోగాలు ఇచ్చి యువతను అదుకున్నామని, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ లు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. డ్రగ్స్ నివారణకు కృషి జరుగుతుందన్నారు. మూసి నది పునర్ జీవన పథకం ఒక అద్భుతమన్నారు.

Tags:    

Similar News