'ప్రజా పాలన'లో ప్రోటోకాల్ ఉల్లంఘన..

Update: 2023-12-28 14:49 GMT

దిశ, నర్సింహులపేట: 'ప్రజా పాలన'లో ప్రోటోకాల్ ఉల్లంఘించిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో పెద్దనాగారం స్టేజి గ్రామ పంచాయతీ వద్ద గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. 'ప్రజా పాలన' కార్యక్రమానికి డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ రామ చంద్రునాయక్ హజరయ్యారు. ఆయనతో పాటు ఆయన సతీమణి జాటోత్ ప్రమీల స్టేజి పైన కూర్చోవడం చర్చాంశనీయం గా మారింది. మండల అధికారులు ప్రోటోకాల్‌ను పాటించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. డీపీఓ హరిప్రసాద్, మండల తహాశీల్దార్ వివేక్, ఎంపీడీవో భారతి నిల్చుని మేడమ్‌ను ప్రభుత్వ అధికార కార్యక్రమంలో కుర్చోబెట్టడం పట్ల అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.


Similar News