వర్షాలు కురుస్తున్న నిండని చెరువులు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సైతం కొన్ని

Update: 2024-09-02 01:50 GMT

దిశ, కాప్రా : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సైతం కొన్ని చెరువులు నిండట్లేదు. వరద నీరు చెరువులోకి చేరకుండా అధికారులే ప్రత్యేక చర్యలు చేపట్టారా, లేక ఇదేమైనా అక్రమార్కుల పనేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాప్రాల్ చెరువు అలుగు నుంచి ప్రవహించే నీరు డ్రైనేజీ లైన్ ద్వారా బయటకు వెళ్తుండడంతో కాప్రా  చెరువులోకి నీరు చేరట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వినాయక చవితి దగ్గర పడుతున్న నేపథ్యంలో చెరువులు నిండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కాప్రా కాలనీ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు కోరుతున్నారు.

కబ్జాదారుల కుట్ర..?

చెరువు బఫర్ జోన్, ఎఫ్ టీఎల్ స్థలాలను ఆక్రమించుకుని చేపట్టిన నిర్మాణదారులే చెరువులోకి వరద రాకుండా కుట్రలు పన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెరువులు నిండుగా ఉంటే వారి నిర్మాణాలకు ఇబ్బందులు తలెత్తే అవకాశాముందని చెరువులో నీరు చేరకుండా కుట్రలు పన్నుతున్నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో చిన్నపాటి వర్షానికే నిండే చెరువులు ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న ఇక్కడి చెరువులు నిండకపోవటం ఏమిటిని పలువురు ప్రశ్నిస్తున్నారు. చెరువులో మురుగు నీరు చేరకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామంటూ వరద నీటి సంరక్షణకు చర్యలు చేపట్టకపోవడం శోచనీయం.

యాప్రాల్ చెరువులో....

యాప్రాల్ నాగిరెడ్డి చెరువులో నీరు నిల్వ ఉండకుండా ముందే చెరువు తూం గేటును ఎత్తేశారనీ స్థానికులు ఆరోపిస్తున్నారు. భారీ వర్షాలకు ఇక్కడి చెరువు నిండకుండా ముందే అక్రమార్కులు తూము ద్వారా నీటిని వదిలేస్తున్నారని ఈ విషయమై నీటి పారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించట్లేదని ఆరోపిస్తున్నారు. చెరువు నీటిని ముందే వదిలేస్తున్నారంటూ ఆదివారం స్థానిక నాయకులు ఇరిగేషన్అ ధికారులను అడిగితే సరైన సమాధానం చెప్పకుండా విషయాన్ని దాటేసే యత్నం చేస్తున్నానని ఆరోపించారు. సర్కిల్ డీసీని అడిగితే తమకు సంబంధం లేదని ఇరిగేషన్ అధికారులను అడగాలని చెప్పడం రెండు శాఖల మధ్య సమన్వయం లోపం ఆక్రమార్కులకు కలిసొస్తుంది. హైడ్రా చర్యలకు హడలెత్తుతున్న అక్రమార్కులు చెరువు బఫర్ జోన్, ఎఫ్ టీఎల్స్థ లాలను కప్పిపుచ్చుకునేందుకు చెరువు నిండకుండా కుట్రలు చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారీ వర్షాలకు చెరువుల్లో ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లు సులువుగా గుర్తించే అవకాశాలు ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు.


Similar News