విద్య‌కు ఈ ప్ర‌భుత్వం ప్రాధాన్యం

రాష్ట్రవ్యాప్తంగా నాణ్యత ప్రమాణాలు ఉండాలని, యూనిఫామ్ గా ఉండే విధంగా అన్ని హాస్టల్స్ ఒకే విధమైన ఆహారం అందజేసే డైట్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించినట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.

Update: 2024-12-14 12:29 GMT

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా నాణ్యత ప్రమాణాలు ఉండాలని, యూనిఫామ్ గా ఉండే విధంగా అన్ని హాస్టల్స్ ఒకే విధమైన ఆహారం అందజేసే డైట్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించినట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. శనివారం గణపురం మండలం గాంధీనగర్ లోని మహాత్మ జ్యోతిబాపూలే వసతి గృహంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే తో కలిసి నూతన డైట్ మెనూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్టల్లో ఉంటున్న విద్యార్థినిలకు, తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. మన ఆరోగ్యం రాష్ట్ర ప్రజల ఆరోగ్యం బాగుండాలని అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

ప్రభుత్వం చదువుకు, విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న‌ట్లు తెలిపారు. విద్యార్థులు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారని, తల్లిదండ్రులు పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఎంతో సంతోషిస్తున్నారని తెలిపారు. చదువుతోపాటు ఆహారానికి సంబంధించిన విషయంలో నాణ్యత తక్కువ కాకుండా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం యూనిఫామ్ గా డైట్ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. గత డైట్ చార్జీలకు కూరగాయలు, పాలు, నిత్యావసర వస్తువులు మార్కెట్ ధరలకు అనుగుణంగా పెంచలేదని కానీ తమ ప్రభుత్వం పిల్లలు ఉజ్వల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని 40 శాతం డైట్ చార్జీలు, 200 శాతం కాస్మొటిక్ ఛార్జీలు పెంచినట్లు తెలిపారు.

విద్యా, వైద్యం తో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను అందుబాటులోకి తెచ్చి విద్యార్థులు అందరూ ఒకటే దగ్గర చదువుకునే విధంగా చర్యలు చేపట్టనున్నామని తెలిపారు. ప్రవేటు పాఠశాలలో లేని సౌకర్యాలు, సదుపాయాలు కల్పించాలని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రతి నియోజకవర్గంలో నిర్మించబోతున్నట్లు తెలిపారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసామని విద్యార్థులు ఇంగ్లీష్ లో చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారని భవిష్యత్తులో మంచి అధికారులుగా, శాస్త్రవేత్తలుగా ఐఏఎస్ అధికారులుగా తయారు కావాలని ఆయన సూచించారు.

పోషకాలతో కూడిన ఆహారం అందించేందుకే డైట్ ప్లాన్‌

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ… యావత్ రాష్ట్రంలో అన్ని గురుకులాలు, సంక్షేమ హాస్టల్లో పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు డైట్ ప్లాన్ రూపొందించినట్లు తెలిపారు. ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలని, బలవర్ధకమైన ఆహారం అందించాలని ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పేద కుటుంబాల విద్యార్థులకు ప్రమాణాలతో కూడిన విద్యను, హాస్టల్ సౌకర్యాలు, భోజన సౌకర్యాలు మేలైన రీతిలో కల్పించేందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మంత్రులు మీకున్న సౌకర్యాలు, భోజన వసతులు పిల్లలకు అందించాలనే నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు. అధికారులు తరచుగా హాస్టళ్లు తనిఖీ చేస్తూ విద్యా, సౌకర్యాలు పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. భూపాల‌ప‌ల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ… గత పది సంవత్సరాల్లో పెంచినటువంటి చార్జీలను తమ ప్రభుత్వం పెంచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి విద్యార్థుల తరఫున అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, బీసీ సంక్షేమ అధికారి శైలజ, ఆర్డీవో మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.


Similar News