నకలీ ఎదుగుదల మందుతో ముప్ఫై ఎకరాల పత్తి పంట నాశనం

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం

Update: 2024-08-26 13:26 GMT

దిశ,పర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం పెద్ద తండాలో రైతులను నట్టేట ముంచారు ఫర్టిలైజర్ యజమాని పెస్టిసైడ్స్ కంపెనీలు.. ఆరుగాలం కష్టపడి పంట పండిద్దామని అధిక వడ్డీలకు అప్పులు చేసి పత్తి పంట సాగు చేస్తున్న ముప్పై మంది గిరిజనులకు యాకుబ్ షావలి ఆగ్రో ఏజన్సీస్ ఫర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్ & సీడ్స్ యజమాని భూక్య అనిల్ పత్తి ఎదుగుదలకు తోడ్పడుతుందని టీ- ఫ్లవర్, తను స్టార్ మందులను రైతులకు అమ్మాడు. ఆ మందులను పిచికారి చేసిన నాలుగు రోజుల్లో పత్తి పంట మొత్తం కమిలిపోవడం తో గడ్డి మందు కంటే ఎక్కువ ప్రభావం పంట పై పడడంతో సుమారు ముప్పై ఎకరాల విస్తీర్ణంలో పత్తి చేను నష్టానికి గురైందని రైతులు వాపోయారు.స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్సై ప్రవీణ్ కు ఫర్టిలైజర్ కంపెనీ పై యాకుబ్ షావలి ఆగ్రో ఏజన్సీస్ ఫర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్ & సీడ్స్ యజమాని భూక్య అనిల్ పై సంబంధిత రైతులు మాకు నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

సమస్య మా దృష్టికి వచ్చింది:  మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రశాంత్

ఫర్టిలైజర్ షాప్ యజమాని అమ్మిన ప్రొడక్ట్ కి పర్మిషన్స్ ఉన్నాయా లేదా చెక్ చే‌స్తాము. ఫీల్డ్ ఇన్ స్పెక్షన్ చేసి రిపోర్ట్ వచ్చిన తర్వాత కంపెనీపై మరియు ఫర్టిలైజర్ యజమానిపై తగు చర్యలు తీసుకుంటాము. రైతులు నూతన విధానాలు మన నూతన రసాయనాలు వాడే మందు మండల వ్యవసాయ అధికారి లేదా సంబంధిత అధికారులను లను కలిసి తెలుసుకున్న తర్వాతే తగు రసాయనాలు వాడాలి. రైతుల నష్టపోకుండా ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.


Similar News