జిల్లాలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకోనున్న గవర్నర్..
త్వరలోనే ములుగు జిల్లాలో ఒక గ్రామాన్ని త్వరలోనే
దిశ,ములుగు ప్రతినిధి: త్వరలోనే ములుగు జిల్లాలో ఒక గ్రామాన్ని త్వరలోనే దత్తత తీసుకోవడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మంగళవారం జిల్లాలో పర్యటించి రాత్రి లక్నవరం సరస్సు ఐలాండ్ లోని కాటేజి లో బస చేశారు. బుధవారం ఉదయం లక్నవరం సరస్సు లో రాష్ట్ర గవర్నర్, మంత్రి అనసూయ సీతక్క, ప్రిన్సిపల్ సెక్రెటరీ బి.వెంకటేశం లతో కలిసి బోటింగ్ చేస్తూ లక్నవరం సరస్సు అందాలను తిలకించారు.అనంతరం మంత్రి అనసూయ సీతక్క రాష్ట్ర గవర్నర్ ను ప్రత్యేక ఫోటో చిత్రంను అందించి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గవర్నర్ పర్యటన ప్రశాంతంగా ముగిసిందని,త్వరలోనే గవర్నర్ ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా నియామకం ఐనా తరువాత మొదటి పర్యటన ములుగు జిల్లాకు విచ్చేసినందుకు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గవర్నర్ పర్యటనలో సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రజా ప్రజా ప్రతినిధులకు , జిల్లా యంత్రాంగానికి మీడియా ప్రతినిధులకు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టూరిజం ఎం డి ప్రకాష్ రెడ్డి, జిల్లా ఎస్పీ శబరిష్ , ఐటీడీఏ పి ఓ చిత్రా మిశ్రా, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ, అదనపు కలెక్టర్ రెవెన్యూ సి.హెచ్. మహేందర్, ఆర్డీఓ సత్య పాల్ రెడ్డి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
కానిస్టేబుల్ ను పరామర్శించిన గవర్నర్..
మంగళవారం ములుగు జిల్లాలో రాష్ట్ర గవర్నర్ పర్యటన నేపథ్యంలో అడవి ప్రాంతంలో భద్రతా పరమైన విధులు నిర్వహిస్తున్న గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ గండ్ల ప్రశాంత్ కు విష కీటకం కుట్టడంతో అస్వస్థతకు గురయ్యాడు. ములుగు జిల్లా ఏరియా హాస్పిటల్ చికిత్స పొందుతున్న నేపథ్యంలో ములుగు జిల్లాలో రెండు రోజుల పర్యటన అనంతరం తిరుగు ప్రయాణంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , మంత్రి దనసరి అనసూయ సీతక్క తో కలిసి జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ గండ్ల ప్రశాంత్ ను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.