టీజీ గురుకుల సెట్ లో మెరిసిన చర్లపల్లి పాఠశాల ఆణిముత్యాలు..

ఫిబ్రవరి 23 వ తారీఖున జరిగిన టీజీ గురుకుల సెట్ లో హనుమకొండ జిల్లా నడికుడ మండలం చర్లపల్లి ప్రాథమిక పాఠశాల నుంచి 16 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయగా అందులో నుండి ఈ రోజు వెల్లడించిన ప్రవేశ ఫలితాల వెల్లడిలో 11 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ తెలిపారు.

Update: 2025-04-05 03:41 GMT

దిశ, నడికూడ : ఫిబ్రవరి 23 వ తారీఖున జరిగిన టీజీ గురుకుల సెట్ లో హనుమకొండ జిల్లా నడికుడ మండలం చర్లపల్లి ప్రాథమిక పాఠశాల నుంచి 16 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయగా అందులో నుండి ఈ రోజు వెల్లడించిన ప్రవేశ ఫలితాల వెల్లడిలో 11 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ తెలిపారు. అర్హత సాధించిన కందికట్ల హర్షిత్, కట్ల హిమాన్షు రెడ్డి, మామిడాల విశ్వతేజ్ రెడ్డి, ముష్కే గగన్ వాల్మీకి, దుబ్బాకుల వశిష్ట భార్గవ, తాళ్లపల్లి శ్రీనిధి, పోతరాజు మోక్ష శ్రీ, బొల్లారం ప్రణవి, శీలం అక్షిత, మండ దీక్షిత, తాళ్లపల్లి శరణ్య విద్యార్థిని విద్యార్థులను ప్రధానోపాధ్యాయులకు అచ్చ సుదర్శన్, ఉపాధ్యాయులు లకావత్ దేవా కంచరాజు కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయుడు అచ్చ సుదర్శన్, గతంలో పనిచేసి వేరే పాఠశాలకు బదిలీ పై వెళ్లిన విజేందర్ రెడ్డి, పారా టీచర్లు బాపూరావు, జ్యోతి కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Similar News