ధర్నాలో పాల్గొంటే సస్పెండ్ చేస్తాం.. కేయూ విద్యార్థులకు బెదిరింపులు

కాకతీయ విశ్వవిద్యాలయం ప్రాంగణం (ఫస్ట్ గేట్) ఈ రోజు నిరసనలు, ధర్నాలతో దద్దరిల్లింది.

Update: 2022-12-01 10:39 GMT

దిశ, కేయూ క్యాంపస్: కాకతీయ విశ్వవిద్యాలయం ప్రాంగణం (ఫస్ట్ గేట్) ఈ రోజు నిరసనలు, ధర్నాలతో దద్దరిల్లింది. గత ఎన్నో సంవత్సరాలుగా పోతన హాస్టల్‌లో ఉంటున్న అబ్బాయిలకు ఉన్నపళంగా ఖాళీ చేయించి, విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని యూనివర్సిటీ విద్యార్థులు ఆరోపించారు. పోతన హాస్టల్‌లో భద్రతా ప్రమాణాలు అంతంత మాత్రమే అన్నారు. ఎటువంటి కాంపౌండ్ రక్షణ లేకుండా ఉన్నదాన్ని అమ్మాయిలకు ఇవ్వడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. బాయ్స్ ఉన్న పోతన హాస్టల్‌లో నీటిని, విద్యుత్‌ను నిలిపివేయడం అమానుషమన్నారు. యధావిధిగా బాయ్స్‌ని పోతన హాస్టల్‌లోనే కొనసాగించాలని సుమారు మూడు గంటల నుంచి శాంతియుతంగా ధర్నా చేస్తున్నారు.ధర్నా చేస్తే, స్ట్రైక్ నిర్వహించే వారిని సస్పెండ్ చేస్తామంటూ బెదిరిస్తున్నారని వాపోయారు. మేము మా హక్కులడిగితే ఇలా బెదిరిస్తారా అని ఆరోపించారు. వీసీ, రిజిస్ట్రార్‌ల వైఖరి విద్యార్థులకు అనుకూలంగా లేదని, ప్రొత్సహించే స్వభావం అసలే.. లేదంటూ నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఎస్ఐ. రాజ్ కుమార్ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News