చేసిన అభివృద్ధి చూపిస్తూ.. ప్రజలను ఓటు అడుగుదాం : ఎమ్మెల్యే గండ్ర
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 10ఏళ్లుగా ఎంతో అభివృద్ధి పనులు,
దిశ,భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 10ఏళ్లుగా ఎంతో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న దేశంలోనే ఒక మార్క్ వేసుకున్నదని, పార్టీ కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేయాలని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు శుక్రవారం రోజున భూపాలపల్లి మండలంలోని రాంపూర్,గోళ్లబుద్దారం,దుదేకులపల్లి,దీక్షకుంటా, పంబాపూర్ గ్రామాలలో బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాల్లోపాల్గొన్నారు.ఎన్నికలు సమీపించి వేల గ్రామాలలో కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లాలని కోరారు.మరి ముఖ్యంగా భూపాలపల్లి మండలం రురల్ గ్రామాలలో 60ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న భూ పట్టా సమస్యలను పరిష్కరించి భూ హక్కు పత్రాలని అందించడం జరిగింది, హక్కు పత్రం పొందిన ప్రతి రైతుకు గిరి వికాస పథకం ద్వారా ఉచితంగా బోర్లు వేయించడం జరిగింది.ఒక్క వేటు వేస్తే 5సంవత్సరాలు ప్రజల సమస్యల పట్ల,అభివృద్ధి కార్యక్రమాల పట్ల పనిచేస్తామని అన్నారు.
భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో చాలా పెద్దగా ఉంటుంది,ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలను ముందుగా పలకరించాలని ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం.గ్రామాల్లో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసినం,ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న భూసమస్యలను,రోడ్ల సమస్యలను పరిష్కరించుకున్నాం. ప్రతి కార్యకర్త ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా భావించి ముందుకు వెళ్లాలని సూచించారు.రైతు బంధు, రైతు భీమా,గ్రామలలో పెన్షన్ లు,వ్యవసాయ బావుల దగ్గరకు రోడ్లు, గ్రామాలలో అంతర్గత రోడ్లు,ఉచిత విద్యుత్, వైద్య రంగంలో పల్లె దవాఖానలు,పాటశాలల అభివృద్ధి కార్యక్రమాలు, పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యా ప్రమాణాలు తదితరులు అంశాలని ఎజెండా గ పెట్టుకుని ప్రచారం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.