47 మంది హెచ్​ఎంలకు షోకాజ్ నోటీసులు

జనగామ జిల్లాలోని వివిధ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు 25 శాతం కంటే తక్కువగా ఉన్నందుకు ఏకంగా 47 మంది ప్రధానోపాధ్యాయులకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు ఇష్యూ చేశారు.

Update: 2024-08-21 12:32 GMT

దిశ, జనగామ : జనగామ జిల్లాలోని వివిధ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు 25 శాతం కంటే తక్కువగా ఉన్నందుకు ఏకంగా 47 మంది ప్రధానోపాధ్యాయులకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు ఇష్యూ చేశారు. జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా ఆదేశాల మేరకు జిల్లా విద్యాధికారి తాజాగా ఈ షాకాజ్ నోటీసులు ఇచ్చారు. అంతటితో ఆగకుండా 60 కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులకు

     సీఎల్ లీవ్ లను శాంక్షన్ చేసినందుకు హెడ్ మాస్టర్ లను బాధ్యులుగా చేస్తూ ఏడుగురు హెడ్ మాస్టర్ లకు కలెక్టర్ ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేశారు. మొత్తం 54 మంది హెచ్ఎంలకు జిల్లా విద్యా శాఖ అధికారి రాము షోకాజ్ నోటీసులు జారీ చేశారు. షోకాజ్ నోటీసులు అందుకున్న వారిలో ప్రాథమిక, హైస్కూల్ హెడ్ మాస్టర్లు ఉన్నారు. 

Tags:    

Similar News