గ్రామ కార్యదర్శి బదిలీ.. రెండు నెలల్లోనే చార్జి ఇవ్వకుండానే మళ్ళీ పోస్టింగ్..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో రెండు నెలలకే మళ్లీ కాటారం, ప్రతాపగిరి, ధన్వాడ గ్రామాల కార్యదర్శిల బదిలీలు జరిగాయి.
దిశ, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో రెండు నెలలకే మళ్లీ కాటారం, ప్రతాపగిరి, ధన్వాడ గ్రామాల కార్యదర్శిల బదిలీలు జరిగాయి. కాటారంలో ప్రజలంతా అనుకున్నట్టే జరిగింది. కాటారం గ్రామ కార్యదర్శి షకీర్ ఖాన్ రెండు నెలల కిందట బదిలీ జరగగానే ఈ బదిలీ ఎన్నాళ్లో ఉండదు మళ్ళీ అతనే రీ పోస్టింగ్ తో వస్తాడు అని ప్రజల్లో చర్చగా మారింది. అందరూ అనుకున్నట్టుగానే రెండు నెలలలోపే కాటారం గ్రామ కార్యదర్శిగా షకీర్ ఖాన్ మళ్లీ బదిలీ పై వచ్చారు.
ఇక్కడికి బదిలీ పై వచ్చిన గ్రామకార్యదర్శి ఉమాదేవికి రెండు నెలలుగా చార్జి ఇవ్వకుండానే షేకీర్ ఖాన్ దాటవేశారు. ఎంపీఓకు ఛార్జ్ ఇవ్వడం లేదని ఫిర్యాదు చేసింది. మండలంలో గురు కార్యదర్శియుల బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాటారం గ్రామ కార్యదర్శిగా షకీర్ ఖాన్ ఇక్కడి కార్యదర్శి ఉమాదేవి దన్వాడకు, ధన్వాడలో పనిచేస్తున్న శంకరయ్యను ప్రతాపగిరి పంచాయతీకి బదిలీ చేశారు.