ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
ధర్మసాగర్ మండల వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. మండల వ్యాప్తంగా...Republicday Celebrations at Dharma Entire Sagar Mandal

దిశ, ధర్మసాగర్: ధర్మసాగర్ మండల వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలలో జాతీయ జెండాలను గురువారం ఆవిష్కరించారు. మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ రజిని, పోలీసు స్టేషన్ లో సీఐ ఒంటేరు రమేష్, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జవహర్ రెడ్డి, వివిధ గ్రామాల్లో ఆయా సర్పంచ్ లు జాతీయా జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డా. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.